Begin typing your search above and press return to search.

అంజలికి ఖచ్చితంగా 'గేమ్‌ చేంజర్‌'..!

తెలుగు అమ్మాయి అయిన అంజలి కోలీవుడ్‌ సినిమాలతో హీరోయిన్‌ గా పాపులారిటీని సొంతం చేసుకుంది

By:  Tupaki Desk   |   21 April 2024 3:30 PM GMT
అంజలికి ఖచ్చితంగా గేమ్‌ చేంజర్‌..!
X

తెలుగు అమ్మాయి అయిన అంజలి కోలీవుడ్‌ సినిమాలతో హీరోయిన్‌ గా పాపులారిటీని సొంతం చేసుకుంది. తెలుగు లో కొన్ని డబ్బింగ్‌ సినిమాలతో కొన్ని డైరెక్ట్‌ సినిమాలతో సందడి చేసినా కూడా స్టార్‌ డమ్‌ మాత్రం దక్కలేదు. అంజలి సినిమాలను తెలుగు ప్రేక్షకులు, ఫిల్మ్‌ మేకర్స్ ఇప్పటి లైట్‌ గానే తీసుకునే వారు.

కానీ ఇక నుంచి అంజలి సినిమాలకు తెలుగు మార్కెట్‌ లో ఖచ్చితంగా మంచి మార్కెట్‌ ఉండటంతో పాటు, ఆమె నటించబోతున్న సినిమాలకు కూడా బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇందతా కూడా గేమ్‌ చేంజర్ వల్ల జరిగే అవకాశాలు ఉన్నాయట.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం.. రామ్‌ చరణ్‌, శంకర్ కాంబోలో రూపొందుతున్న గేమ్‌ చేంజర్ లో అంజలి కనిపించేది కొద్ది సమయం మాత్రమే అయినా కూడా మెయిన్‌ హీరోయిన్ కియారా పాత్రను డామినేట్‌ చేసే విధంగా ఉంటుందట. ఫ్లాష్‌ బ్యాక్‌ ఎపిసోడ్‌ లో చరణ్ కు జోడీగా అంజలి కనిపించబోతుంది.

ఆ మధ్య అంజలి గెటప్‌ మరియు చరణ్‌ వెంట ఆమె ప్రజెన్స్‌ ను చూసి ప్రేక్షకులు షాక్ అయ్యారు. చరణ్‌ రెండో పాత్రకు కచ్చితంగా ఆమె సరి జోడీ అనడంలో సందేహం లేదు. గేమ్‌ చేంజర్ సినిమా తర్వాత అంజలి క్రేజ్ టాలీవుడ్‌ లో రెట్టింపు అవ్వడం ఖాయం.

గేమ్‌ చేంజర్ లో అంజలి పోషిస్తున్న పాత్ర సినిమాకు అత్యంత కీలకం. అందుకే సినిమా విడుదల తర్వాత అంజలి టాలీవుడ్‌ లో మరింత బిజీ అవ్వడం ఖాయం. ఇలాంటి పాత్రలు కేవలం అంజలి మాత్రమే చేయగలదు అన్నంత స్థాయిలో ఈ పాత్రలో ఆమె నటన ఉంటుందని కూడా యూనిట్‌ సభ్యులు అంటున్నారు. కనుక గేమ్‌ చేంజర్ మవీ అంజలికి కచ్చితంగా కెరీర్‌ లో గేమ్‌ చేంజర్‌ అవ్వబోతుంది.