Begin typing your search above and press return to search.

ప‌చ్చ‌డి బాధ్య‌త నాదే అంటోన్న సీత‌మ్మ‌!

తెలుగు హీరోయిన్ అంజ‌లి మ‌ళ్లీ టాలీవుడ్ లో స్పీడ‌ప్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా కొత్త ప్రాజెక్ట్ లు అందుకుంటుంది

By:  Tupaki Desk   |   9 April 2024 9:34 AM GMT
ప‌చ్చ‌డి బాధ్య‌త నాదే అంటోన్న సీత‌మ్మ‌!
X

తెలుగు హీరోయిన్ అంజ‌లి మ‌ళ్లీ టాలీవుడ్ లో స్పీడ‌ప్ అవుతోన్న సంగ‌తి తెలిసిందే. వ‌రుస‌గా కొత్త ప్రాజెక్ట్ లు అందుకుంటుంది. `గేమ్ ఛేంజ‌ర్` తో పాన్ ఇండియాలో ప‌రిచ‌యం కాబోతుంది. శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ తో తొలిసారి క‌లిసి ప‌నిచేయ‌డంతో ఎంతో ఎగ్జైట్ మెంట్ తో ఉంది. ఈ సినిమాతో అమ్మ‌డు స్టార్ మారుతుంద‌ని చాలా ఆశ‌లే పెట్టుకుంది. ఇదిగాక `గ్యాంగ్స్ ఆఫ్ గోదావ‌రి`లో న‌టిస్తోంది.

అలాగే `గీతాంజ‌లి`కి సీక్వెల్ గా తెర‌కెక్కుతోన్న `గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చింది` అంటూ భ‌య‌పెట్ట‌డానికి రెడీ అవుతోంది. ఈ మూడు సినిమాల‌తో ఇదే ఏడాది హ‌ల్చ‌ల్ చేయ‌నుంది. ఇక ఈ మూడు సినిమాలు మొద‌టి అక్ష‌రం `జీ`తో మొద‌ల‌వ్వ‌డం మ‌రో ఆస‌క్తిక‌ర విష‌యం. దీంతో అమ్మ‌డు ఇదో ల‌క్కీ ఛాన్స్ గాను భావిస్తోంది. మ‌రి ఈ భామ దృష్టిలో ఉగాది ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసుకుందామా? అమ్మ‌డు ఉగాది ప‌ర్వ‌దినాన్ని ఎలా పుర‌స్క‌రించుకుంటుందంటే? ఆ స‌క్తిక‌ర సంగ‌తే చెప్పుకొచ్చింది.

`ఉగాది పండ‌గన్నా.. ర‌క‌ర‌కాల రుచులు క‌లిసిన ప‌చ్చ‌డి అన్నా ఎంతో ఇష్టం. అమ్మ‌మ్మ వాళ్లింటి ద‌గ్గ‌ర ఉంటో ఎంతో గ్రాండ్ గా సెల‌బ్రేట్ చేసుకుంటా. ఉదయాన్నే లేచి...స్నానం చేసి ..కొత్త బ‌ట్ట‌లేసుకుని..పూజ చేసి ఉగాది పచ్చ‌డి తిన్నాక గానీ మ‌రో ప‌నిలోకి వెళ్లేదాన్ని కాదు. ఇప్ప‌టికే ఇంట్లో అదే ప‌ద్ద‌తి పాటిస్తున్నాం. ఉగాది ప‌చ్చ‌డి నేనే స్వ‌యంగా త‌యారు చేస్తా. ఇప్పుడు ఉగాదికి గీతాంజ‌లి మ‌ళ్లీవ‌చ్చింది ప్రేక్ష‌కుల ముందుకు వ‌స్తుంది. ఇది కూడా ఉగాది ప‌చ్చ‌డిలాగే అన్ని రుచులు క‌లిసి ఉన్న సినిమా. హార‌ర్.. కామెడీ అన్నీర‌కాల భావోద్వేగాలుంటాయ‌న్నారు.

కోన వెంక‌ట్ అండ్ కో తెర‌కెక్కించిన హార‌ర్ థ్రిల్ల‌ర్ గీతాజంలి మంచి విజ‌యం సాధించిన సంగ‌తి తెలిసిందే. ఆసినిమా క‌మ‌ర్శియ‌ల్ గా మంచి విజ‌యం సాధించింది. ఈ నేప‌థ్యంలో అదే టైటిల్ తో గీతాంజ‌లి మ‌ళ్లీ వ‌చ్చిందిని తెర‌కెక్కించారు. గీతాంజ‌లి టీమ్ తోనే తెర‌కెక్కించారు. ఇప్ప‌టికే రిలీజ్ అయిన ప్ర‌చార చిత్రాలు మంచి బ‌జ్ ని తీసుకొచ్చాయి. ఈనెల 11న సినిమా ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.