వీడియో : స్టేజ్‌పై తెగ ఊపేస్తూ డాన్స్ చేసిన అంజలి
హిందీ, పంజాబీ మ్యూజిక్ వీడియోల్లో కనిపించిన అంజలి అరోరా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా సందడి చేస్తూనే ఉంటుంది.
By: Tupaki Desk | 22 Aug 2025 12:46 PM ISTసోషల్ మీడియా ఫాలోవర్స్‌కి అంజలి అరోగా గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. గతంలో టిక్‌టాక్, ఆ తర్వాత ఇన్‌స్టాగ్రామ్‌లో అంజలి అరోరా చేసిన సందడి, చేస్తున్న సందడి అంతా ఇంతా కాదు. ఆమె షార్ట్ వీడియోస్ వల్ల స్టార్ హీరోయిన్స్ రేంజ్‌లో గుర్తింపు దక్కించుకుంది. ఒకప్పుడు ఆమె చేసిన కచ్చబాదాం సాంగ్ డాన్స్ రీల్‌కి మిలియన్స్‌లో వ్యూస్, లక్షల్లో లైక్స్ వచ్చాయి. దాంతో ఓవర్ నైట్‌లో ఈ అమ్మడు స్టార్‌గా మారి పోయింది. అంతే కాకుండా అంతకు ముందు చేసిన వీడియోలు సైతం బాగా వైరల్ అయ్యాయి. ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో పాపులారిటీ దక్కగానే బాలీవుడ్‌లో అడుగు పెట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ అమ్మడు సైతం బాలీవుడ్‌లో అడుగు పెట్టేందుకు తెగ ప్రయత్నాలు చేస్తుంది. ఒకటి రెండు సినిమా ఆఫర్లు సైతం వచ్చాయనే వార్తలు ఆ మధ్య కాలంలో వచ్చాయి.
అంజలి అరోరా సోషల్ మీడియా ఫాలోయింగ్
కచ్చ బాదాం పాటకు చేసిన డాన్స్‌తో వైరల్ కావడంతో కంగనా రనౌత్ హోస్ట్‌గా చేసిన రియాల్టీ షో లాక్ అప్ లో కంటెస్టెంట్ గా చేసింది. 2022 లో ఆ షో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఆ షో అంజలి అరోరాను మరింతగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చింది. దాంతో ఆమె హీరోయిన్స్ స్థాయిలో సోషల్ మీడియాలో పాపులారిటీ సొంతం చేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్‌లో అంజలి అరోరాకి దాదాపుగా 13.3 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉన్నారు. ఇండస్ట్రీలో ఉన్న చాలా కొద్ది మంది హీరోయిన్స్‌కి మాత్రమే 10 మిలియన్‌లు అంతకు మించి ఫాలోవర్స్ ఉన్నారు. అలాంటిది ఈ కచ్చబాదం బ్యూటీకి ఏకంగా 13 మిలియన్‌ల ఫాలోవర్స్ ఉండటం అంటే మామూలు విషయం కాదు. సోషల్ మీడియాలో ఈ అమ్మడి యొక్క ఫాలోయింగ్‌తో హీరోయిన్‌గానూ ఆఫర్లు వస్తున్నాయని తెలుస్తోంది.
మ్యూజిక్ వీడియోల్లో అంజలి అరోరా
హిందీ, పంజాబీ మ్యూజిక్ వీడియోల్లో కనిపించిన అంజలి అరోరా సోషల్ మీడియా ద్వారా రెగ్యులర్‌గా సందడి చేస్తూనే ఉంటుంది. ఈమెకున్న క్రేజ్ నేపథ్యంలో తాజాగా స్టేజ్ షో లకు సైతం ఆహ్వానిస్తున్నారు. ఇటీవల ఈమె థాయిలాండ్‌లోని ఒక క్లబ్‌లో డాన్స్ చేస్తున్న వీడియో బయటకు వచ్చింది. ఫుల్ గ్రేస్‌తో అంజలి అరోరా చేస్తున్న డాన్స్‌కి ప్రతి ఒక్కరూ ఫిదా అవుతున్నారు. ఆమె అందంతో పాటు, డాన్స్ ప్రతిభను ఒకే సారి చూపించడంతో రెండు కళ్లు చాలడం లేదు అంటూ నెటిజన్స్ ఈ వీడియోను తెగ కామెంట్స్ చేస్తున్నారు. పొట్టి డ్రెస్‌లు వేసుకోవడం ద్వారా ఈ అమ్మడు మరింతగా వైరల్ అవుతోంది. హీరోయిన్స్‌కి ఏమాత్రం తగ్గకుండా ఈ అమ్మడు చేస్తున్న జోరు డాన్స్‌కి అంతా ఫిదా అవుతున్నారు. ఇంతటి అందగత్తెకు ఇప్పటికీ బాలీవుడ్‌లో బ్రేక్ దక్కక పోవడం విడ్డూరంగా ఉందని కొందరు అంటున్నారు.
సినిమాలు, వెబ్ సిరీస్‌ల్లో..
సౌత్ ఫిల్మ్ మేకర్స్ అయినా వెంటనే అంజలి అరోరాను తమ సినిమాల్లో నటింపజేయాలని కొందరు కోరుతున్నారు. మోడల్‌గా కెరీర్‌ను ప్రారంభించిన అంజలి అరోరా సోషల్ మీడియా ఇన్‌ఫ్ల్యూయెన్సర్‌గా మారింది. ముందు ముందు హీరోయిన్‌గానూ ఈమె వరుస సినిమాలు చేస్తుందేమో చూడాలి. ప్రస్తుతం ఈ అమ్మడి యొక్క సోషల్ మీడియా ఫాలోయింగ్ చూస్తూ ఉంటే రాబోయే రోజుల్లో సినిమాల్లో, వెబ్ సిరీస్‌ల్లో వరుసగా నటించే అవకాశాలు ఉన్నాయి. అందుకు సంబంధించిన చర్చలు మొదలు కావచ్చు. అతి త్వరలోనే ఈమె ఒక సినిమాతోనూ ప్రేక్షకుల ముందుకు రాబోతుందనే వార్తలు వస్తున్నాయి. ఆ సినిమా ఏంటి, ఇతర విషయాలు ఏంటి అనేది త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. హీరోయిన్‌గా కాకుండా ఇతర పాత్రల్లో ఈమె నటించేందుకు ఓకే చెప్తే వెంటనే పది సినిమా ఆఫర్లు ఆమె తలుపు తట్టే అవకాశాలు ఉన్నాయని విశ్లేషకులు అంటున్నారు.
