పెళ్లి విషయంలో పెద్దాయన అలా ఫీలవుతున్నాడా?
ఇండస్ట్రీలో పెళ్లికాని ప్రసాదులు చాలా మంది ఉన్నారు. పెళ్లిపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం.
By: Tupaki Desk | 7 May 2025 7:30 AMఇండస్ట్రీలో పెళ్లికాని ప్రసాదులు చాలా మంది ఉన్నారు. పెళ్లిపై ఒక్కొక్కరిది ఒక్కో అభిప్రాయం. ఇలా ధాంపత్య జీవితానికి దూరమైంది చాలా మంది. అందులో నటుడు అనీష్ కురివెళ్ల ఒకరు. నటుడిగా ఈ యనకు మంచి పేరుంది. ప్రత్యేక పాత్రలు....కీలక పాత్రలు పోషిస్తూ తెలుగులో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్నాడు. `డాలర్స్ డ్రీమ్స్` తో నటుడిగా ఎంట్రీ ఇచ్చాడు. `ఆనంద్`, `పెళ్లి చూపులు` ఇలా చాలా సినిమాలు చేసారు.
చివరిగా `శ్రీకాకుళం షెర్లాక్ హోమ్స్` లో నటించాడు. దర్శకుడిగానూ కొన్ని సినిమాలు..సిరీస్ లు కూడా డైరెక్ట్ చేసాడు. అయితే అనీష్ ఇంకా సింగిల్ లైఫ్ నే లీడ్ చేస్తున్నాడు. ఇంకా పెళ్లి చేసుకోలేదు. పెళ్లి.. ఫ్యామిలీ ...పిల్లలు ఎక్కడ? అంటే ఐమాయ్ నాట్ ఇంట్రెస్టెడ్ మ్యారీడ్ లైఫ్ అనేసారు. ఇలా సింగిల్ గా ఉండటమే తనకు ఇష్టమంట. సోలో లైఫ్ సో బెటర్ అంటున్నారు.
బంధాలు..బంధావ్యాలు కంటే ఉన్నంత కాలం ఇలా సంతోషంగా సాగిపోవడవమే. పెళ్లి విషయంలో నేను ఇంకా ఆయసుకు రానట్లే ఫీలవుతున్నాను. `ఆ విషయంలో గురించి ఎప్పుడూ ఆలోచించలేదు కూడా. ఎవరో ఏదో అనుకుంటారని నేను పట్టించుకోను. నా లైఫ్ లో నే ను మాత్రమే ఉన్నాను. ఇంకెవరు లేరు. నాకు కావాల్సిన కంపర్స్ట్ అన్నీ దొరుకతున్నప్పుడు పెళ్లి ఎందుకు? అనేసారు.
ఇప్పటికే అనీష్ కురివెళ్ల జుట్టు నెరిసింది. చాలా సినిమాల్లో తెల్ల జుట్టుతోనే కనిపిస్తున్నారు. అదే ఆయనకు స్టైల్ గానూ హైలైట్ అవుతుంది. ప్రత్యేక మ్యాకప్ లు అవసరం లేకుండానే ఆయన పాత్రలు కనిపిస్తున్నాయి. అదీ సంగతి