Begin typing your search above and press return to search.

అనిరుధ్.. టాలీవుడ్ లక్కు మామూలుగా లేదు

వచ్చే ఏడాది కూడా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనిరుద్ మ్యూజిక్ తో రాబోతున్నాయి.

By:  Tupaki Desk   |   9 Nov 2023 4:00 AM GMT
అనిరుధ్.. టాలీవుడ్ లక్కు మామూలుగా లేదు
X

సౌత్ ఇండియన్ మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్ ప్రస్తుతం జెట్ స్పీడ్ తో దూసుకుపోతున్నాడు. జైలర్, జవాన్, లియో సినిమాలతో హ్యాట్రిక్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ సినిమూలు ఐదు వందల కోట్లకి పైనే కలెక్ట్ చేశాయి. వచ్చే ఏడాది కూడా వరుసగా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ అనిరుద్ మ్యూజిక్ తో రాబోతున్నాయి.

వాటిలో ఎన్టీఆర్ దేవర, శంకర్ భారతీయుడు 2 సినిమాలు రెడీ అవుతున్నాయి. అలాగే తెలుగులో గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా సితార ఎంటర్టైన్ మెంట్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా నిర్మిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కూడా ప్రారంభం అయ్యింది. శ్రీలీల హీరోయిన్ గా ఖరారు అయ్యింది.

ప్రస్తుతం విజయ్ పరశురామ్ దర్శకత్వంలో ఫ్యామిలీ స్టార్ మూవీ చేస్తున్నారు. సంక్రాంతి రేసులో ఈ సినిమా ఉంది. ఈ కారణంగా ముందుగా ఫ్యామిలీ స్టార్ సినిమాని కంప్లీట్ చేయడంపై దృష్టి పెట్టారు. VS12 కంటే ముందుగానే ఫ్యామిలీ స్టార్ రానుంది. ఈ టైంలో గౌతమ్ తిన్ననూరి ఓ చిన్న సినిమా చేయాలని ప్లాన్ చేశారంట.

సితార ఎంటర్టైన్మెంట్ లోనే ఈ సినిమా కూడా గౌతమ్ చేస్తున్నారు. దీనిని అనిరుద్ మ్యూజిక్ అందించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది. త్వరలో దీనికి సంబందించిన క్లారిటీ రానుందని ఇండస్ట్రీ వర్గాలలో వినిపిస్తోన్న మాట. ఇది వరకు గౌతమ్ దర్శకత్వంలో వచ్చిన జెర్సీ మూవీకి కూడా అనిరుద్ మ్యూజిక్ అందించారు. దీనిని బట్టి గౌతమ్ ని అనిరుద్ మ్యూజిక్ విషయంలో ఫస్ట్ ఛాయస్ గా మారిపోయాడనే మాట వినిపిస్తోంది.

అయితే ఇప్పుడు అనిరుద్ 15 కోట్ల వరకు రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. మొక మ్యూజిక్ కి అంత పెట్టాలంటే మూవీ ప్రొడక్షన్ వర్క్ కి, అందులో క్యాస్టింగ్ కి తక్కువలో తక్కువ 10 నుంచి 15 కోట్లు వేసుకున్న మొత్తం 30 కోట్ల వరకు బడ్జెట్ తేలనుంది. ఈ బడ్జెట్ అంటే అది ఇక చిన్న సినిమా అవ్వదని చెప్పాలి. మరి ఈ సినిమా విషయంలో సితార ఎలా ముందుకి వెళ్తుంది. ఎలాంటి హీరోతో ఈ మూవీని పట్టాలు ఎక్కిస్తారు అనేది ఆసక్తికరంగా మారింది. ఫ్యామిలీ స్టార్ రిలీజ్ తర్వాత వచ్చే ఏడాదిలో విజయ్ తో అనుకున్న మూవీని గౌతమ్ సెట్స్ పైకి తీసుకొని వెళ్లనున్నారు.