Begin typing your search above and press return to search.

దేవర.. సౌండ్ పెంచుతున్న అనిరుధ్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర

By:  Tupaki Desk   |   27 Dec 2023 5:26 AM GMT
దేవర.. సౌండ్ పెంచుతున్న అనిరుధ్
X

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పాన్ ఇండియా మూవీ దేవర. భారీ బడ్జెట్ తో ఈ చిత్రాన్ని యువసుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ చేస్తోన్న మూవీ ఇదే కావడంతో ఎక్స్ పెక్టేషన్స్ నెక్స్ట్ లెవల్ లో ఉన్నాయి. జాన్వీ కపూర్ ఈ చిత్రంతో టాలీవుడ్ లోకి అడుగుపెడుతోంది.

కొరటాల శివ కూడా మొదటి సారి తన జోనర్ నుంచి పూర్తిగా బయటకొచ్చి ఈ చిత్రాన్ని కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో చేస్తున్నాడు. దేవర మూవీ కోసం ఒక ఫిక్షనల్ వరల్డ్ ని క్రియేట్ చేశారు. దీనికోసం పాస్ట్ లోకి వెళ్లి కథని చెబుతున్నారు. ఓ ఐలాండ్ నేపథ్యంలో మూవీ కథ నడుస్తుందని ఇప్పటికే టాక్ బయటకొచ్చింది. ఇక భారీ బడ్జెట్ తో తెరకెక్కుతోన్న మూవీ కావడంతో చాలా పకడ్బందీగా రెడీ చేస్తున్నారు.

ఇప్పటికే 80 శాతం షూటింగ్ కంప్లీట్ అయ్యిందని కళ్యాణ్ రామ్ క్లారిటీ ఇచ్చారు. అలాగే దేవర సినిమాలో ఇప్పటి వరకు మీరు చూడని కొత్త ప్రపంచాన్ని చూస్తారని చెప్పారు. డెవిల్ మూవీ ప్రమోషన్స్ లో దేవర సినిమాకి సంబందించిన కొన్ని అప్డేట్స్ ని కళ్యాణ్ రామ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే ఈ సినిమా టీజర్ జనవరి 8న లాంచ్ చేయబోతున్నట్లు తాజాగా ప్రకటించారు.

ఈ సినిమాని కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు. కోలీవుడ్ లో తన మ్యూజిక్ తో ట్రెండ్ సెట్ చేస్తోన్న అనిరుద్ టాలీవుడ్ లో మాత్రం ఇప్పటి వరకు ఒక్క సక్సెస్ కూడా అందుకోలేదు. అయితే దేవర మూవీతో పాన్ ఇండియా లెవల్ లో ప్రూవ్ చేసుకోవాలని బలంగా ఫిక్స్ అయ్యాడు. అతని మ్యూజిక్ ఎలా ఉండబోతోంది అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది.

ఫ్యాన్స్ కోసం అనిరుద్ మ్యూజిక్ ఏ లెవల్ లో దేవర కోసం ఇచ్చాడు తెలుసుకోవడానికి రాబోయే టీజర్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ టీజర్ తోనే అనిరుద్ వర్క్ ఎలా ఉందనేది ఒక క్లారిటీ వచ్చేస్తుంది. అలాగే తారక్ కూడా దేవర పాత్రలో ఎంత అద్భుతంగా కనిపించబోతున్నాడు అనేది స్పష్టత వస్తుంది. అందుకే ఫ్యాన్స్ అందరూ జనవరి 8 కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.