Begin typing your search above and press return to search.

దేవరకి ఆ రేంజ్ ఇవ్వగలడా..?

కోలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అక్కడ వరుస స్టార్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు

By:  Tupaki Desk   |   19 Aug 2023 7:58 AM GMT
దేవరకి ఆ రేంజ్ ఇవ్వగలడా..?
X

కోలీవుడ్ లో సూపర్ ఫాంలో ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ అక్కడ వరుస స్టార్ సినిమాలతో దూసుకెళ్తున్నాడు. అనిరుద్ సినిమా అంటే సినిమా హిట్టే అన్న టాక్ వచ్చేసింది. ముఖ్యంగా కమల్, రజిని లాంటి హీరోలకు అనిరుద్ ఇచ్చే మ్యూజిక్ అయితే సినిమాకు హైలెట్ అవడమే కాకుండా ఫ్యాన్స్ ని పిచ్చెక్కించేస్తుంది. ఈ క్రేజ్ తోనే అనిరుద్ వరుసగా భారీ సినిమాలు వస్తున్నాయి. అయితే తెలుగు దర్శక నిర్మాతలు కూడా అనిరుద్ వైపు చూస్తున్నారు. కానీ టాలీవుడ్ లో సెలెక్టెడ్ ఛాన్స్ లు పిక్ చేసుకుంటున్నాడు అనిరుద్.

ఈ క్రమంలో అనిరుద్ లేటెస్ట్ గా యంగ్ టైగర్ ఎన్.టి.ఆర్ దేవర సినిమాకు మ్యూజిక్ అందిస్తున్నాడు. లాస్ట్ ఇయర్ విక్రం, రీసెంట్ గా వచ్చిన జైలర్ ఈ రెండు సినిమాలకు అనిరుద్ ఇచ్చిన మ్యూజిక్ నెక్స్ట్ లెవెల్ లో ఉండగా ఇప్పుడు తారక్ దేవరకు అనిరుద్ ఎలాంటి మ్యూజిక్ ఇస్తాడా అని ఫ్యాన్స్ ఎగ్జైటింగ్ గా ఉన్నారు. దేవర సినిమాకు అనిరుద్ ఇచ్చే మ్యూజిక్ ని బట్టి ఆ సినిమా రీచింగ్ ఉంటుందని చెప్పొచ్చు.

కొరటాల శివ డైరెక్షన్ లో దేవర సినిమా తెరకెక్కుతుంది. ఆచార్య తర్వాత కొరటాల శివ దేవర స్క్రిప్ట్ కోసమే కొంతకాలం టైం తీసుకున్నాడు.. RRR తర్వాత ఎన్.టి.ఆర్ చేయబోతున్న ఈ సినిమా ఆశించిన రేంజ్ లోనే ఉండాలని ఫ్యాన్స్ కోరుతున్నారు. అందుకు ఏమాత్రం తగ్గకుండా కొరటాల శివ దేవరని ప్లాన్ చేస్తున్నాడని తెలుస్తుంది. అంతేకాదు అనిరుద్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్లస్ అయ్యే అవకాశం ఉంది.

తన మ్యూజిక్ కి పెరిగిన ఈ డిమాండ్ తో అనిరుద్ ఒక్కో సినిమాకు 10 కోట్ల దాకా రెమ్యునరేషన్ అందుకుంటున్నాడని టాక్. దేవర సినిమాకు అనిరుద్ మ్యూజిక్ కూడా మెయిన్ హైలెట్స్ లో ఒకటిగా ఉంటుందని చెప్పుకుంటున్నారు. 2024 ఏప్రిల్ 5న దేవర రిలీజ్ ప్లాన్ చేయగా సినిమా తారక్ ఫ్యాన్స్ కి మాస్ ఫీస్ట్ అందించేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర హంగామా ఎలా ఉంటుంది పాన్ ఇండియా రేంజ్ లో ఎన్.టి.ఆర్ స్టామినా ఎలా ఉండబోతుంది అన్నది వచ్చే సమ్మర్ లో తెలుస్తుంది. ఎన్టీఆర్ సరసన జాన్వి కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా ఫ్యాన్స్ కి అదిరిపోయే ట్రీట్ అందించడం పక్కా అని చిత్ర యూనిట్ చెబుతున్నారు.