Begin typing your search above and press return to search.

మళ్లీ వార్తల్లో పవన్ 'అజ్ఞాతవాసి'

ఈ మధ్య కాలంలో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది

By:  Tupaki Desk   |   15 Aug 2023 7:41 AM GMT
మళ్లీ వార్తల్లో పవన్ అజ్ఞాతవాసి
X

ఈ మధ్య కాలంలో తమిళ సంగీత దర్శకుడు అనిరుధ్‌ గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. జాతీయ స్థాయిలో కూడా అనిరుధ్‌ సంగీతం గురించి చర్చ జరుగుతోంది. షారుఖ్ ఖాన్‌ తో జవాన్ సినిమా కోసం అనిరుధ్‌ కలిసి పని చేస్తున్న నేపథ్యంలో ముందు ముందు స్టార్‌ మ్యూజిక్ కంపోజర్‌ గా బాలీవుడ్‌ లో నిలిచే అవకాశాలు ఉన్నాయని అంతా మాట్లాడుకుంటూ ఉన్నారు.

జవాన్ సినిమాలోని మొదటి పాటతో అనిరుధ్ హిందీ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించాడు. మొదటి పాటతో అలరించిన అనిరుధ్ తాజాగా జవాన్‌ నుండి రెండవ పాటను విడుదల చేయడం జరిగింది. హిందీ ప్రేక్షకులు ఆ పాటను ఎంజాయ్ చేస్తున్నారు. కానీ తెలుగు ప్రేక్షకులు మాత్రం అజ్ఞాతవాసి గురించి మాట్లాడుకుంటున్నారు.

అనిరుధ్ ట్యూన్ చేసిన జవాన్ రెండో పాటను వింటూ ఉంటే పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి సినిమా గుర్తుకు వస్తుంది అంటూ కొందరు నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. గాలి వాలుగా, బయటకొచ్చి చూస్తే పాటలను మిక్స్ చేసినట్లుగా ఈ ట్యూన్ ఉంది అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో అనిరుధ్ గురించి పాజిటివ్ గా ప్రచారం జరుగుతూ ఉండగా ఇలాంటి ట్యూన్ ఒకటి రావడంతో తెలుగు ప్రేక్షకులు విమర్శలు చేస్తున్నారు.

త్రివిక్రమ్‌ దర్శకత్వంలో రూపొందిన అజ్ఞాతవాసి సినిమాతో అనిరుధ్ టాలీవుడ్‌ ప్రేక్షకులకు దగ్గర అవుతాడని అంతా భావించారు. కానీ ఆ సినిమా డిజాస్టర్ అవ్వడంతో పాటు పాటలు కూడా మెప్పించలేక పోయాయి. దాంతో అనిరుధ్ తో వర్క్ చేసేందుకు స్టార్ హీరోలు ఆసక్తి చూపించలేదు. ఇప్పుడు ఎన్టీఆర్‌ దేవర సినిమాకు అనిరుధ్ వర్క్ చేస్తున్నాడు.

తమిళంలో తాజాగా రూపొంది ప్రేక్షకుల ముందుకు వచ్చిన సూపర్‌ స్టార్‌ మూవీ జైలర్‌ ను తో మంచి విజయాన్ని అందుకున్న అనిరుధ్ టాలీవుడ్‌ లో దేవరతో మొదటి బిగ్గెస్ట్‌ కమర్షియల్‌ సక్సెస్ ను అందుకోవడం ఖాయం అన్నట్లుగా కొందరు నమ్ముతున్నారు. ఆ పాటలు కూడా అజ్ఞాతవాసిని గుర్తు చేస్తే ఇక టాలీవుడ్‌ లో ఆయనకు ఆఫర్లు రాకపోవచ్చు అనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది.