Begin typing your search above and press return to search.

అనిరుధ్‌ ఆ సాంగ్​ కాపీ కొట్టినట్టేనా?

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో టాప్ - 5 మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరని అంటే తప్పుకుండా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తుంది

By:  Tupaki Desk   |   25 Oct 2023 10:30 AM GMT
అనిరుధ్‌ ఆ సాంగ్​ కాపీ కొట్టినట్టేనా?
X

ప్రస్తుతం ఇండియన్ ఫిల్మ్​ ఇండస్ట్రీలో టాప్ - 5 మ్యూజిక్ డైరెక్టర్స్ ఎవరని అంటే తప్పుకుండా అనిరుధ్ రవిచందర్ పేరు వినిపిస్తుంది. రీసెంట్​గా తన బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌ మ్యూజిక్​తో జైలర్, లియో చిత్రాలను మరో రేంజ్‌కు తీసుకెళ్లారు. అయితే అంతటి స్థాయి ఉన్న మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్.. ప్రస్తుతం లియో మ్యూజిక్​ కాపీ ఆరోపణలను తెగ ఎదుర్కొంటున్నారు. అంతటా దీని గురించే చర్చ సాగుతోంది.

వివరాళ్లోకి వెళితే.. కోలీవుడ్​ స్టార్​ దళపతి విజయ్, బాలీవుడ్ స్టార్ యాక్టర్​ సంజయ్ దత్, యాక్షన్ కింగ్​ అర్జున్ సర్జా, గౌతమ్ వాసుదేవన్ మీనన్, త్రిష సహా పలువురు కలిసి నటించి లియో చిత్రం.. ప్రస్తుతం వరల్డ్ వైడ్​గా కలెక్షన్లను భారీగా వసూలు చేస్తోంది. అయితే ఇదే సమయంలో లోకేశ్ కనగరాజ్ తెరకెక్కించిన ఈ సినిమాకు నెగటివిటీ కూడా ఎక్కువైంది. లియో స్కామ్​ పేరుతో ఇప్పటికే ఓ వైపు ట్రెండ్ చేస్తున్న మరికొందరు ఇప్పుడు లియో మ్యూజిక్ కూడా కాపీ అంటూ ట్రోల్స్ చేస్తున్నారు.

ఈ సినిమాలో ఓ పాటను అనిరూద్​ కాపీ చేసినట్టు జోరుగా ప్రచారం సాగుతోంది. చిత్రంలోని ఆర్డినరీ మ్యాన్ అనే పాటకు యూట్యూబ్​లో మంచి రెస్పాన్స్​ వస్తున్నప్పటికీ.. అదే సమయంలో బెలారష్యన్ మ్యూజిక్ డైరెక్టర్ ఒట్నికా రూపొందించిన వేర్ ఆర్ యూ అనే పాటకు కాపీలా ఉందనే విషయం సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతోంది. దాంతో అనిరుధ్ కాపీ కొట్టాడా? అనే సందేహాలు అందరిలో వ్యక్తమవుతున్నాయి. మరికొంతమంది కాస్త ఈ రెండు పాటలు కొంచెం మాత్రమే పోలీ ఉంది అని అంటున్నారు.

ఈ విషయం మ్యూజిక్ డైరెక్టర్ ఒట్నికా దృష్టికి కూడా వెళ్లింది. ఆయన స్పందిస్తూ.. ప్రస్తుతానికి ఎవరిపై ఆరోపణలు చేయాలనుకోవడం లేదు. దీనిపై మరోసారి క్షుణ్ణంగా పరిశీలించి చెబుతాను" అని అన్నారు. మరి తర్వాత ఆయన ఎలాంటి సమాధానం చెబుతారో అన్న ఆసక్తి చాలా మందిలో నెలకొంది. అలానే దీనిపై అనిరూధ్​ ఎలా రియాక్ట్ అవుతారో... చూడాలి మరి ఏం జరుగుతుందో..