Begin typing your search above and press return to search.

తెలుగుపై కాస్త శ్రద్ద పెట్టవయ్యా అనిరుధ్!

అయితే అనిరుద్ మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పెట్టినంత శ్రద్ధ పాటల విషయంలో పెట్టడం లేదని, అందుకే సాంగ్స్ పెద్దగా క్లిక్ కావడం లేదని అంటున్నారు.

By:  Tupaki Desk   |   15 Oct 2023 1:30 AM GMT
తెలుగుపై కాస్త శ్రద్ద పెట్టవయ్యా అనిరుధ్!
X

అనిరుద్ మ్యూజిక్ డైరెక్టర్ గా ప్రస్తుతం ఇండియాలోనే నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు. జైలర్, జవాన్ చిత్రాలతో బ్యాక్ టూ బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్స్ ని తన ఖాతాలో వేసుకున్నారు. ఇప్పుడు లియో మూవీతో ప్రేక్షకుల ముందుకి రాబోతున్నారు. ఈ సినిమాపై ఇప్పటికే పాజిటివ్ టాక్ ఉంది. అయితే ప్రమోషన్స్ లో భాగంగా లియో చిత్రం నుంచి వచ్చి ఏ సాంగ్ కూడా ఇప్పటి వరకు ఆడియన్స్ కి రీచ్ కాలేదు.

బ్యాగ్రౌండ్ స్కోర్ పరంగా బెస్ట్ అవుట్ ఇస్తున్న అనిరుద్ నుంచి సాంగ్స్ మాత్రం చాలా పేలవంగా వస్తున్నాయనే విమర్శలు వినిపిస్తున్నాయి. మరీ ముఖ్యంగా డబ్బింగ్ సినిమాలపైన తెలుగు లెరిక్స్ విషయంలో అస్సలు శ్రద్ధ పెట్టడం లేదని సాహితీప్రియుల నుంచి వినిపిస్తోన్న మాట. తాజాగా లియో సాంగ్స్ విషయంలో తెలుగు లెరిక్స్ మరీ తీసికట్టుగా ఉన్నాయని అంటున్నారు.

ఒక మ్యూజిక్ డైరెక్టర్ గా ఏ భాషలో అయిన సాహిత్యం కరెక్ట్ గా సెట్ అయ్యేలా చూసుకోవాల్సిన బాద్యత సంగీత దర్శకుడి మీద ఉంటుంది. అయితే అనిరుద్ మాత్రం బ్యాగ్రౌండ్ స్కోర్ మీద పెట్టినంత శ్రద్ధ పాటల విషయంలో పెట్టడం లేదని, అందుకే సాంగ్స్ పెద్దగా క్లిక్ కావడం లేదని అంటున్నారు. నా రెడీ అంటూ సాంగ్ పాటలో సాహిత్యం అయితే మరీ దారుణంగా ఉందనే విమర్శలు వస్తున్నాయి.

ఇదే పరిస్థితి తెలుగులో చేస్తోన్న దేవర, విజయ్ దేవరకొండ సినిమాల విషయంలో కూడా అనిరుద్ చేస్తే తెలుగు ఆడియన్స్ అంతగా యాక్సప్ట్ చేయకపోవచ్చు. తెలుగు సినీ ప్రేమికులు ఒక మ్యూజిక్ డైరెక్టర్ నుంచి బ్యాగ్రౌండ్ స్కోర్ ఎంతగా ఇష్టపడతారో అంతే స్థాయిలో మంచి సాంగ్స్ కూడా కోరుకుంటారు. అనిరుద్ కూడా సాంగ్స్ ద్వారా ఎక్కువ పాపులారిటీ తెచ్చుకున్నారు.

ఇప్పుడు ఆ సాంగ్స్ విషయంలోనే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనే మాట వినిపిస్తోంది. పాన్ ఇండియా స్థాయిలో మూవీస్ చేసే సమయంలో అన్ని భాషలలో పాటలకి సంబందించిన సాహిత్యం కరెక్ట్ గా కుదిరేలా ప్లాన్ చేసుకుంటే ఎక్కువ కాలం సక్సెస్ ని కొనసాగించగలరని సినీ విశ్లేషకులు అంటున్న మాట.