Begin typing your search above and press return to search.

దేవర.. అనిరుధ్ వల్లే ఇబ్బందా?

ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర

By:  Tupaki Desk   |   3 Jan 2024 4:46 AM GMT
దేవర.. అనిరుధ్ వల్లే ఇబ్బందా?
X

ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా హిట్ తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ టాలీవుడ్ లోకి ఈ మూవీతోనే ఎంట్రీ ఇస్తోంది. ఎన్టీఆర్-కొరటాల కాంబోలో ఇది వరకే వచ్చిన జనతా గ్యారేజ్ సూపర్ హిట్ కావడంతో ఈ సినిమాపై ఫ్యాన్స్ లో భారీ అంచనాలు ఉన్నాయి.

ఈ సినిమాను కంప్లీట్ యాక్షన్ బ్యాక్ డ్రాప్ కథతో తెరకెక్కిస్తున్నారు కొరటాల. తన జోనర్ నుంచి బయటకొచ్చి ఈ మూవీ కోసం ఒక ఫిక్షనల్ వరల్డ్ ను క్రియేట్ చేశారు. ఫ్యాన్స్ అంచనాలకు మించి సినిమాను పకడ్బందీగా భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నారు. ఓ ఐలాండ్ నేపథ్యంలో ఈ సినిమా స్టోరీ నడుస్తుందని వార్తలు వస్తున్నాయి. ఈ మూవీ గ్లింప్స్.. మరో ఐదు రోజుల్లో విడుదల కానుంది.

అయితే ఈ చిత్రానికి కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ మ్యూజిక్ అందిస్తున్నారు. తమిళ సినీ ఇండస్ట్రీలో తన మ్యూజిక్ తో ట్రెండ్ సెట్ చేస్తున్న ఆయన.. తెలుగు లో ఇంతవరకు ఒక్క హిట్ కూడా కొట్టలేదు. దీంతో దేవర మూవీతోనే పాన్ ఇండియా లెవెల్ లో క్రేజ్ సంపాదించాలని అనిరుధ్ ఫిక్స్ అయ్యారట. అందుకే ఓ రేంజ్ లో మ్యూజిక్ అందిస్తున్నారట.

ఇది బాగానే ఉన్నా.. ఇప్పుడు నెట్టింట మరో వార్త చక్కర్లు కొడుతోంది. నిజానికి ఈ సినిమా షూటింగ్ గతేడాది డిసెంబర్ కల్లా మేకర్స్ పూర్తి చేయాలనుకున్నారట. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ అవుతుండగా.. మరోవైపు పాన్ ఇండియా లెవెల్లో ప్రమోషన్లు నిర్వహించి వేసవిలో మూవీని రిలీజ్ చేయాలనుకున్నారట. కానీ మ్యూజిక్ విషయంలో అనిరుధ్ కాస్త ఆలస్యం చేస్తున్నారట. అందుకే వచ్చే నెల వరకు షూటింగ్ జరగనుందట.

ఈ విషయం తెలుసుకున్న ఫ్యాన్స్.. త్వరగా మ్యూజిక్ కంప్లీట్ చేసేయ్ అనిరుధ్ అన్నా అంటూ కామెంట్లు చేస్తున్నారు. సినిమా రిలీజ్ ను ఎట్టిపరిస్థితుల్లో వాయిదా వేయొద్దని కోరుతున్నారు. ఈ సినిమాలో ఎన్టీఆర్, జాన్వీతోపాటు బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీ ఖాన్ లీడ్ రోల్ చేస్తున్నారు. రెండు భాగాలు తెరకెక్కుతున్న ఈ మూవీని నందమూరి తారక రామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. వేసవి కానుకగా తొలిపార్ట్ ఏప్రిల్ 5వ తేదీన విడుదల కానుంది.