Begin typing your search above and press return to search.

విదేశాలకు వెళ్లాల్సిన వాడిని కీబోర్డ్ ఇచ్చి కంపోజర్ ని చేశాడు..!

ధనుష్ వారితో మాట్లాడి అనిరుద్ లో మంచి ప్రతిభ ఉంది. నన్ను నమ్మండి.. కచ్చితంగా మంచి వృద్ధిలోకి వస్తాడని చెప్పారట.

By:  Tupaki Desk   |   14 March 2024 4:01 AM GMT
విదేశాలకు వెళ్లాల్సిన వాడిని కీబోర్డ్ ఇచ్చి కంపోజర్ ని చేశాడు..!
X

కోలీవుడ్ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుద్ రవిచంద్రన్ ను మ్యూజిక్ డైరెక్టర్ గా పరిచయం చేసింది హీరో ధనుష్ అన్న సంగతి తెలిసిందే. ధనుష్, శృతి హాసన్ జంటగా నటించిన 3 సినిమాను ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్ట్ చేశారు. ఈ సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ గా అనిరుద్ ని తీసుకున్నారు. సినిమాలోని వై దిస్ కొలవెరి సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో అందరికీ తెలిసిందే. ఫస్ట్ సినిమాతోనే తన మార్క్ చూపించాడు అనిరుద్.

అనిరుద్ టాలెంట్ మెచ్చి వరుస సినిమా ఆఫర్లు వచ్చాయి. కోలీవుడ్ లో స్టార్ హీరోల నుంచి యువ హీరోల వరకు అందరు అనిరుద్ కావాలని అంటున్నారు. అయితే అనిరుద్ సక్సెస్ పై రీసెంట్ గా ఐశ్వర్య రజినీకాంత్ ప్రస్తావించారు. అనిరుద్ సినిమాల్లోకి రావడానికి ధనుష్ కారణమని అన్నారు. అనిరుద్ ని ఎం.బి.ఏ కోసం విదేశాలకు పంపించేందుకు అతని పేరెంట్స్ సిద్ధం కాగా.. ధనుష్ వారితో మాట్లాడి అనిరుద్ లో మంచి ప్రతిభ ఉంది. నన్ను నమ్మండి.. కచ్చితంగా మంచి వృద్ధిలోకి వస్తాడని చెప్పారట. ఆ తర్వాత ఒక కీబోర్డ్ కొనిచ్చి అనిరుద్ ని కంపోజర్ గా మార్చారు ధనుష్. వచ్చిన అవకాశాన్ని అనిరుద్ సద్వినియోగ పరచుకున్నాడు. చాలా కష్టపడుతున్నాడు ఆ విషయంలో తనకు చాలా సంతోషంగా ఉందని అన్నారు ఐశ్వర్య రజినీకాంత్.

కోలీవుడ్ లో స్టార్ సినిమా అంటే చాలు ముందు అనిరుద్ దగ్గరకు వెళ్లాక అతను కాదన్నాకే వేరే మ్యూజిక్ డైరెక్టర్ దగ్గరకు వెళ్తుంది. రజినీకాంత్, కమల్, సూర్య, విక్రం, ధనుష్, అజిత్, విజయ్ ఇలా తమిళ స్టార్ హీరోలందరితో కలిసి పనిచేస్తున్నాడు అనిరుద్. తెలుగులో కూడా అనిరుద్ వరుస అవకాశాలు అందుకుంటున్నాడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అజ్ఞాతవాసి, నాని గ్యాంగ్ లీడర్ సినిమాలకు పనిచేసిన అనిరుద్ ప్రస్తుతం ఎన్.టి.ఆర్ దేవరకు మ్యూజిక్ డైరెక్షన్ చేస్తున్నాడు.

ఈతరం సంగీత ప్రియులకు సరికొత్త సంగీత అనుభవాన్ని ఇస్తున్న అనిరుద్ తమిళంలోనే కాదు తెలుగులో కూడా తన ఫాం కొనసాగించాలని చూస్తున్నాడు. తనను అంతగా ఎంకరేజ్ చేశాడు కాబట్టే ధనుష్ సినిమా అంటే చాలు అనిరుద్ స్పెషల్ గా మ్యూజిక్ కంపోజిషన్ చేస్తుంటాడు. ధనుష్, అనిరుద్ కాంబినేషన్ లో వచ్చిన సినిమాలన్నీ కూడా మ్యూజికల్ సెన్సేషన్ గా మారాయి.