Begin typing your search above and press return to search.

అనిరుధ్ కూడా ఇలా చేశాడేంటి?

ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తమన్ కు సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటీ ఎదురవుతూ ఉంటుందో తెలిసిందే.

By:  Tupaki Desk   |   9 Jan 2024 4:47 AM GMT
అనిరుధ్ కూడా ఇలా చేశాడేంటి?
X

ప్రస్తుతం టాలీవుడ్లో నంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా కొనసాగుతున్న తమన్ కు సోషల్ మీడియాలో ఎంత నెగిటివిటీ ఎదురవుతూ ఉంటుందో తెలిసిందే. తను పని చేస్తున్న సినిమాకు సంబంధించి ఏ ప్రోమో రిలీజ్ అయినా.. అది ఎక్కడి నుంచి కాపీ కొట్టాడా అని చూస్తుంటారు నెటిజన్లు. గతంలో తమన్ పాటలు, బిజియంకు సంబంధించి అనేకసార్లు కాపీ మరకలు అంటడమే అందుకు కారణం.

కొన్నేళ్లుగా స్టార్ హీరోల సినిమాల్లో చాలా వాటికి తమనే పనిచేస్తుండడంతో ఆయా హీరోల అభిమానులు వెరైటీ కోరుకుంటున్నారు. ముఖ్యంగా వాళ్ళు తమిళ సెన్సేషనల్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వైపు చూస్తున్నారు. ఎన్టీఆర్ అభిమానులు సైతం దేవర సినిమాకు సంగీత దర్శకుడిగా అనిరుధే కావాలని పెద్ద ఉద్యమమే చేశారు సోషల్ మీడియాలో. వాళ్లు కోరుకున్నట్లే అతడినే ఎంపిక చేశాడు కొరటాల శివ.

అనిరుధ్ మీద తారక్ ఫ్యాన్స్ భారీ అంచనాలతో ఉండగా.. నిన్న రిలీజ్ అయిన టీజర్ తో అతను ఆ అంచనాలను అందుకోలేక పోయాడనే చెప్పాలి. ఏదో హాలీవుడ్ సినిమాల స్టైల్లో ఇంగ్లీష్ పాట హమ్మింగ్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్ కలర్ ఇద్దామని చూశాడు కానీ.. సినిమా బ్యాక్ డ్రాప్, టీజర్లో చూపించిన విజువల్స్ కు అది సెట్ కాలేదు.

మరో వైపు అనిరుధ్ వేరే సినిమాలకు వాడిన సౌండ్స్ ఇక్కడ రిపీట్ చేశాడనే విమర్శలు కూడా వస్తున్నాయి. ఆరంభంలో వచ్చే ట్రాక్ లియో థీమ్ సాంగ్ కు దగ్గరగా ఉండగా.. చివర్లో వచ్చే బీజీఎం సౌండ్ కత్తి సినిమా థీమ్ కు కాపీలా అనిపించింది. కొందరు టీజర్లో అనిరుధ్ మ్యూజిక్ సూపర్ అంటూ ఎలివేషన్లు ఇస్తుంటే ఇంకొందరు ఈ పోలికలు చూపించి అతడిని ట్రోల్ చేస్తున్నారు. మొత్తానికి అనిరుధ్ వర్క్ అయితే పూర్తి సంతృప్తికరంగా లేదన్నది వాస్తవం.