Begin typing your search above and press return to search.

ఆ హీరోతో అనిరుధ్ కూడా దిగిపోతే..

ఈ మూవీలో అనిరుద్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడంట. కొన్ని సీన్స్ లోనే కాకుండా ఓ సాంగ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు అనిరుద్ కనిపిస్తాడని టాక్.

By:  Tupaki Desk   |   1 May 2024 4:00 AM GMT
ఆ హీరోతో అనిరుధ్ కూడా దిగిపోతే..
X

కోలీవుడ్ లో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా దూసుకుపోతున్న సంగీత దర్శకుడు అనిరుద్ రవిచందర్. గత ఏడాది సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ దర్శకత్వంలో వచ్చిన జైలర్ మూవీకి అనిరుద్ మ్యూజిక్ తోనే గ్రాండ్ సక్సెస్ వచ్చిందని చెప్పాలి. ఈ సినిమాలో రజినీకాంత్ ని నెవ్వర్ బిఫోర్ ఎలివేషన్ కు అనిరుద్ మ్యూజిక్ మరింత బలాన్ని ఇచ్చింది.

అలాగే లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో వచ్చిన లియో మూవీకి అనిరుద్ బెస్ట్ మ్యూజిక్ అందించారు. అనిరుద్ మ్యూజిక్ అంటే యూత్ కి కనెక్ట్ అయ్యే సాంగ్స్ ఎక్కువగా వినిపిస్తూ ఉంటాయి. ఎంత పెద్ద స్టార్ హీరో మూవీకి అయినా తన మ్యూజిక్ తో డిఫరెంట్ ఫ్లేవర్ ని తీసుకురావడం అనిరుద్ స్టైల్.

అందుకే కోలీవుడ్ లో అనిరుద్ ట్యూన్స్ కి విశేషమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ప్రస్తుతం అనిరుద్ తెలుగులో ఎన్టీఆర్ దేవర సినిమాకి సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా నుంచి మే 20న ఫస్ట్ సింగిల్ రానున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే అనిరుద్ కి సంబందించిన మరో క్రేజీ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

సూపర్ స్టార్ రజినీకాంత్ ప్రస్తుతం టీజే జ్ఞాన్ వేల్ దర్శకత్వంలో వేట్టయాన్ అనే మూవీ చేస్తున్నారు. భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఈ మూవీలో అమితాబ్ బచ్చన్, ఫాహద్ ఫాజిల్, రానా దగ్గుబాటి, మంజు వారియర్, దుషార విజయన్, రితికా సింగ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ సినిమాకి అనిరుద్ మ్యూజిక్ అందిస్తున్నారు.

ఈ మూవీలో అనిరుద్ క్యామియో రోల్ లో కనిపించనున్నాడంట. కొన్ని సీన్స్ లోనే కాకుండా ఓ సాంగ్ లో సూపర్ స్టార్ రజినీకాంత్ తో పాటు అనిరుద్ కనిపిస్తాడని టాక్. ఈ పాత్ర మూవీలో చాలా స్పెషల్ గా ఉండబోతోందనే మాట వినిపిస్తోంది. కచ్చితంగా సూపర్ స్టార్ రజినీకాంత్, అనిరుద్ కనిపించే సాంగ్ మూవీ ఫీస్ట్ గా ఉండబోతోందని భావిస్తున్నారు.

జైలర్ సినిమాతో సూపర్ స్టార్ కి బ్లాక్ బస్టర్ హిట్ ఇచ్చిన అనిరుద్ అంతకుమించి సాంగ్స్ వేట్టయాన్ సినిమాకి ఇవ్వబోతున్నాడని తెలుస్తోంది. అనిరుద్ గతంలో కూడా చాలా సినిమాలలో అతను చేసిన సాంగ్స్ లో క్యామియో రోల్స్ పోషించారు. ఆ సాంగ్స్ కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయ్యాయి. ఇప్పుడు ఏకంగా సూపర్ స్టార్ రజినీకాంత్ తో కలిసి ఆన్ స్క్రీన్ పై స్టెప్పులు వేయబోతున్నాడు. ఇటు రజిని అభిమానులకి, అటు అనిరుద్ ఫ్యాన్స్ కి కూడా ఈ సాంగ్ బాగా కనెక్ట్ అయ్యే అవకాశం ఉందని కోలీవుడ్ సర్కిల్ లో వినిపిస్తోంది.