అనిరుధ్ కన్నా తమన్ అయితే వేరే లెవెల్!
ఏ సినిమా అయినా మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. రిలీజ్ కు ముందే సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడంలో కచ్చితంగా హెల్ప్ అవుతాయి.
By: Tupaki Desk | 23 Jun 2025 1:00 PM ISTఏ సినిమా అయినా మ్యూజిక్ కీలక పాత్ర పోషిస్తుందని చెప్పడంలో ఎలాంటి డౌట్ అక్కర్లేదు. రిలీజ్ కు ముందే సాంగ్స్ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేయడంలో కచ్చితంగా హెల్ప్ అవుతాయి. మూవీ రిలీజ్ అయ్యాక బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా కీ రీల్ పోషిస్తుంది. కాబట్టి మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో మేకర్స్ జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేస్తుంటారు.
అదే సమయంలో ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో పలువురు మ్యూజిక్ డైరెక్టర్స్ మంచి ఫేమ్ సంపాదించుకున్నారు. సెపరేట్ ఫ్యాన్ బేస్ దక్కించుకున్నారు. అలాంటి సంగీత దర్శకుల్లో ఎస్ ఎస్ తమన్, అనిరుధ్ రవిచందర్ కూడా ఉన్నారు. వారి వర్క్ కోసం ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది. వారి అవుట్ పుట్స్ ట్రెండింగ్ లోనే ఉంటాయి.
రీసెంట్ గా దళపతి విజయ్ నటించిన జననాయకుడు మూవీ నుంచి టీజర్ ను మేకర్స్ రిలీజ్ చేసిన విషయం తెలిసిందే. హెచ్. వినోథ్ దర్శకత్వం వహిస్తున్న ఆ సినిమా నుంచి రిలీజ్ అయిన ఫస్ట్ రోర్ గ్లింప్ల్ మంచి రెస్పాన్స్ సంపాదించుకుంది. అదే సమయంలో అనిరుధ్ రవిచందర్ అందించిన బ్యాక్ గ్రౌండ్ స్కోర్ పై సోషల్ మీడియాలో చర్చ జరుగుతోంది.
ఇప్పటి వరకు అనిరుధ్ వర్క్ వేరే లెవెల్ లో ఉండేదని.. ఇప్పుడు జననాయకుడు విషయంలో అలా లేదని కామెంట్లు పెడుతున్నారు. అయితే జననాయకుడు మూవీ.. టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ నటించిన భగవంత్ కేసరికు రీమేక్ గా తెరకెక్కిస్తున్నట్లు ఎప్పటి నుంచో సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. క్లారిటీ లేకపోయినా టాక్ వినిపిస్తోంది.
ఆ మూవీకి తమన్ మ్యూజిక్ డైరెక్టర్ గా వర్క్ చేసిన విషయం తెలిసిందే. ఆయన అందించిన మ్యూజిక్ తో పాటు బ్యాక్ గ్రౌండ్ స్కోర్ మంచి రెస్పాన్స్ అందుకుంది. బాలయ్యకు తమన్ ఇచ్చిన ఎలివేషన్స్ అదిరిపోయాయి. దీంతో ఇప్పుడు జన నాయకుడు గ్లింప్స్ కు తమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఇచ్చుంటే వేరే లెవెల్ అని సినీ ప్రియులు చెబుతున్నారు.
అనిరుధ్ రవిచందర్ కన్నా తమన్ వర్క్ చేసుంటే సూపర్ గా ఉండేదని అభిప్రాయపడుతున్నారు. దీంతో తమన్ టాలెంట్ అంటే ఏంటో మరోసారి ప్రూవ్ అయిందని అంటున్నారు. తమన్ మరిన్ని హిట్స్ అందుకునే ఛాన్స్ కచ్చితంగా ఉందని కామెంట్లు పెడుతున్నారు. వాటి కోసం వెయిట్ చేస్తున్నామని చెబుతున్నారు. మరి తమన్ ఫ్యూచర్ లో ఎలాంటి హిట్స్ అందుకుంటారో వేచి చూడాలి.
