తాంబూళం నుంచి కోట్ల రూపాయలు తీసుకునే స్థాయికి
ఒకప్పుడు పెళ్లి వేడుకల్లో సంగీతం వాయించిన ఓ సాధారణ యువకుడు ఇప్పుడు దేశం మొత్తం గర్వించదగ్గ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు.
By: Sravani Lakshmi Srungarapu | 7 Feb 2026 8:00 PM ISTలైఫ్ ఎప్పుడెలా టర్న్ అవుతుందో ఎవరూ చెప్పలేం. కొందరు ఎంత కష్టపడినా రాని గుర్తింపు, మరికొందరికి ఈజీగా వచ్చేస్తుంది. సినీ ఇండస్ట్రీలో కూడా అంతే. ఎన్ని సినిమాలు చేసినా రాని ఫేమ్, క్రేజ్, ఫాలోయింగ్ ఒక్కోసారి ఒకే ఒక్క సినిమాతో వచ్చేస్తుంది. కొన్నిసార్లు ఒక్క అవకాశం జీవితాన్నే మార్చేస్తుంది. అప్పటివరకు ఏదో చేసే వాళ్లు ఆ అవకాశంతో ఎక్కడికో వెళ్లిపోతారు.
ఒకప్పుడు పెళ్లి వేడుకల్లో సంగీతం వాయించిన ఓ సాధారణ యువకుడు ఇప్పుడు దేశం మొత్తం గర్వించదగ్గ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ గా ఓ వెలుగు వెలుగుతున్నారు. ఆయన మరెవరో కాదు, అనిరుధ్ రవిచందర్. ప్రస్తుతం ఒక్కో సినిమాకు కోట్ల రూపాయలు పారితోషికంగా తీసుకుంటున్న అనిరుధ్, తన గతాన్ని గుర్తు చేసుకుంటూ ఎమోషనల్ అయ్యారు.
పెళ్లిళ్లకు కీబోర్డు వాయించిన అనిరుధ్
రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, చిన్న వయసులో పెళ్లిళ్లు, ఫంక్షన్లలో కీబోర్డు వాయించేవాడినని, అప్పట్లో రూ.500 ఇస్తే పెద్ద విషయమని, కొన్నిసార్లు డబ్బుల కంటే తాంబూలమిచ్చి పంపేవారని గుర్తు చేసుకున్నారు అనిరుధ్. అప్పుడు ఆ తక్కువ డబ్బుతో వచ్చిన సంతోషం, ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నా కూడా రావడం లేదని అనిరుధ్ చెప్పుకొచ్చారు.
3 సినిమాతో విపరీతమైన క్రేజ్ ను తెచ్చుకున్న అనిరుధ్ కు ఇప్పుడు పాన్ ఇండియా స్థాయిలో మంచి గుర్తింపు ఉంది. అనిరుధ్ నుంచి సినిమా వస్తుందంటే దాని కోసం ఎంతోమంది వెయిట్ చేస్తూ ఉంటారు. తన బీజీఎం, ట్రెండీ ట్యూన్స్ తో సినిమాలను నెక్ట్స్ లెవెల్ కు తీసుకెళ్లే అనిరుధ్ ఇప్పటికే పలు భారీ ప్రాజెక్టులకు సంగీతమివ్వగా, ఆయన నుంచి ఎన్నో సూపర్ హిట్ సాంగ్స్ వచ్చాయి. అనిరుధ్ ను చూస్తుంటే కష్టపడితే ఏదైనా సాధించొచ్చని అర్థమవుతుంది.
