అనిరుధ్ ఎందుకంత స్పెషల్... మిగతా వాళ్ళు ఆయన్ని టచ్ చేయకపోవడానికి కారణమేంటి..?
యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ ని అందించాలని దర్శకుల దగ్గర డిమాండ్ చేస్తున్నారు.
By: Tupaki Desk | 17 Sept 2026 4:00 AM ISTఒకప్పుడు సినిమా కథ బాగుండి దర్శకుడు దానిని స్క్రీన్ మీద పర్ఫెక్ట్ గా ప్రజెంట్ చేసినప్పుడే మాత్రమే వాళ్ళకి సక్సెస్ లు దక్కేవి. కానీ ఈ మధ్యకాలంలో కథతో సంబంధం లేకుండా, మేకింగ్ సో సో గా ఉన్నా కూడా కేవలం బ్యాగ్రౌండ్ మ్యూజిక్ మీద ఆధారపడి సినిమాలు సక్సెస్ లను సాధిస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే మ్యూజిక్ డైరెక్టర్లు సినిమా సక్సెస్ లో కీలక పాత్ర వహిస్తున్నారు. ఇక ఇలాంటి క్రమంలోనే తమిళ సినిమా ఇండస్ట్రీలో తన కెరియర్ ను స్టార్ట్ చేసిన అనిరుధ్ ప్రస్తుతం ఇండియన్ సినిమా ఇండస్ట్రీలో నెంబర్ వన్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయాడు. అతను చేసిన ప్రతి సినిమా మ్యూజికల్ హిట్స్ గా నిలుస్తున్నాయి. సాంగ్స్ విషయంలో గానీ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ విషయంలో కానీ ఆయన ఎక్కడ కాంప్రమైజ్ అవ్వడం లేదు. అందువల్లే ఈరోజు ఆయన టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒకడిగా నిలవడమే కాకుండా ఇండియన్ సినిమా ఇండస్ట్రీని శాసించే స్థాయికి వెళ్ళిపోయాడు. యంగ్ హీరోల దగ్గర నుంచి స్టార్ హీరోల వరకు ప్రతి ఒక్కరు తమ సినిమాకి అనిరుధ్ మ్యూజిక్ ని అందించాలని దర్శకుల దగ్గర డిమాండ్ చేస్తున్నారు.
ప్రొడ్యూసర్లు సైతం తను ఎంత అడిగితే అంత డబ్బులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు అంటే ఆయన మార్కెట్ ఏ రేంజ్ లో ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. తన నుంచి ఒక పాట వస్తే చాలు ఆ పాటకు ఎక్కడ లేని క్రేజ్ వస్తుందని సినిమా మీద హైప్ పెరుగుతుందని దర్శకులు భావిస్తున్నారు. అనిరుధ్ కి ఎందుకంత క్రేజ్ ఉంది. మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు ఏం చేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ పనిని సరిగ్గా కొనసాగించలేకపోతున్నారా? అందువల్లే అనిరుధ్ టాప్ పొజిషన్ కి వెళ్లిపోయాడా అంటూ సోషల్ మీడియాలో మరి కొంతమంది కామెంట్స్ చేస్తున్నారు. నిజానికి అనిరుధ్ మ్యూజిక్ అందించడంలో కొత్త పంథా ను ఫాలో అవుతాడు.
ఆయన ఎక్కడి నుంచి మ్యూజిక్ ఇన్స్పైర్ అవుతాడో తెలియదు కానీ తనకంటూ ఒక సపరేట్ ట్రాక్ ని ఏర్పాటు చేసుకొని వయోలిన్, గిటార్, సింథా సైజర్స్ వంటి ఇన్స్టుమెంట్స్ ద్వారా వండర్స్ ను క్రియేట్ చేస్తున్నాడు. ఇక సాంగ్స్ విషయంలో ఆయన చాలా సెలెక్టెడ్ గా ఉంటాడు. ఓకల్స్ విషయంలో కూడా స్పెషల్ కేర్ తీసుకొని ఆ సాంగ్ టెంపో ను సైతం ఫర్ఫెక్ట్ గా ఫాలో అవుతాడు కాబట్టే అనిరుధ్ కి ఎక్కడలేని క్రేజ్ అయితే వస్తుంది. ఆయన నుంచి వచ్చిన ప్రతి పాట విపరీతంగా నచ్చుతుంది...మిగిలిన మ్యూజిక్ డైరెక్టర్లందరు కూడా కొత్తగా ప్రయోగాలు చేసి ఎప్పటికప్పుడు వాళ్ళను వాళ్ళు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరమైతే ఉంది. కాబట్టి సినిమా రంగంలో రాణించాలి అంటే వైవిధ్యాన్ని చూపించక తప్పదు. ప్రస్తుతం అనిరుధ్ టాప్ డైరెక్టర్లకు బెస్ట్ ఛాయిస్ గా మారిపోయాడు...
