బీజీఎమ్ తో నడిపించే సత్తా అతడికే సొంతం!
యువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ మార్కెట్లో ఇప్పుడో బ్రాండ్. వరుస విజయాలే అనిరుద్ ని పతాక స్థాయిలో నిలబెట్టాయన్నది కాదనలేని వాస్తవం.
By: Tupaki Desk | 3 Aug 2025 5:51 PM ISTయువ సంగీత సంచలనం అనిరుద్ రవిచందర్ మార్కెట్లో ఇప్పుడో బ్రాండ్. వరుస విజయాలే అనిరుద్ ని పతాక స్థాయిలో నిలబెట్టాయన్నది కాదనలేని వాస్తవం. ఒకప్పుడు సంగీతం, నేపథ్య సంగీతమంటే? రెహ మాన్ పేరు ప్రముఖంగా వినిపించేది. కానీ నేడు సన్నివేశం అందుకు భిన్నంగా అనిరుద్ పేరు సౌత్ లో మారు మ్రోగిపోతుంది. పాటకు బాణీ కట్టడమే కాదు సినిమాను నేపథ్య సంగీతంతో పైకి లేపోచ్చని రెహ మాన్ తర్వాత నిరూపించిన ఘనుడు అనిరుద్. కెరీర్ ఆరంభంలోనే తానేంటే నిరూపించాడు.
మూడేళ్లలో అనిరుద్ క్రేజ్ రెట్టింపు
`కొలవెరీ డీ`తో వెలుగులోకి వచ్చిన అనిరుద్ ప్రస్థానం చిత్ర పరిశ్రమలో దిగ్విజయంగా కొనసాగుతోంది. కోలీవుడ్, టాలీవుడ్ లో అనిరుద్ అందిస్తోన్న సంగీతం సినిమాకు ప్రధాన బలంగా మారుతోంది. సినిమా ఎలా ఉన్నా? అనిరుద్ బీజీఎమ్ కోసమైనా సినిమాకెళ్లొచ్చు అనే మాట బలంగా వినిపిస్తోంది అంటే? మా ర్కెట్ లో అతడి ప్రభావం ఏ స్థాయిలో ఉందన్నది అద్దం పడుతోంది. గడిచిన మూడేళ్లలో అనిరుద్ క్రేజ్ రెట్టింపు అయిందన్నది కాదనలేని వాస్తవం. పల్లె పట్టణం ప్రతీ చోట అనిరుద్ పేరు మారుమ్రోగుతోంది.
ఎంతమందున్నా సంథింగ్ స్పెషల్
అంటే? ఈ మూడేళ్ల కాలంలో అతడు అందించిన ఔట్ పుట్ ప్రధాన కారణం. 'జెర్సీ', 'విక్రమ్', 'జవాన్', 'లియో', 'ఇండియన్ 2', ' దేవర', 'కింగ్ డమ్' లాంటి చిత్రాలు అనిరుద్ స్థాయిని రెట్టింపు చేసిన చిత్రా లే. వాటిలో నేపథ్య సంగీతం ప్రేక్షకులకు ఓ కొత్త అనుభూతిని పంచింది. ఈ సినిమాలు రిలీజ్ అయిన క్రమంలో బీజీఎమ్ గురించి ప్రేక్షకులు ప్రత్యేకంగా మాట్లాడుకున్నారు. సినిమాకు అతడి సంగీతం ప్రధాన బలంగా కనిపించిందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. మార్కెట్ లో ఎంత మంది సంగీత దర్శకులున్నా? కొత్త కుర్రాడు మాత్రం సంథింగ్ స్పెషల్ గా ప్రేక్షకులు సహా మీడియాలో ఫోకస్ అవ్వడం విశేషం.
ఎంత మంది ఉన్నాఅతడికే!
ఓ సినిమాను నేపథ్య సంగీతం తో ఆరంభం నుంచి పైకి లేపడం అన్నది అనిరుద్ కు మాత్రమే చెల్లిందని ప్రత్యేకంగా చాటుకున్నాడు. సినిమా అంతా ఒకే టెంపోని కొన సాగించడం అన్నది చిన్న విషయం కాదు. ఎంతో క్రియేటివ్ గా థింక్ చేయగలిగాలి.. సాంకేతిక సహా పరికరాలపై అపార అనుభవంతోనే సాధ్యమ వుతుంది. ఈ మాట రెహమాన్ ఓ సందర్భంలో తన అనుభవ పూర్వకంగా చెప్పుకొచ్చారు. ఆ తర్వాత మళ్లీ అనిరుద్ లోనే అలాంటి సంగీతాన్ని చూసానని ఆస్కార్ దిగ్గజమే కీర్తించారు.
బీజీఎమ్ తో బొమ్మ ఆడించే లా
రీసెంట్ రిలీజ్ `కింగ్ డమ్` కథ, ఇతర అంశాలు పక్కన బెడితే? అనిరుద్ బీజీఎమ్ తోనే సినిమాను పైకి లేపాడు. ఆరంభం నుంచి ముగింపు వరకూ ప్రేక్షకుడిని ఎంగేజ్ చేయడంలో అనిరుద్ నూరు శాతం సక్సెస్ అయ్యాడు. సినిమాలో పాటలు లేకపోయినా? బీజీఎమ్ తో బొమ్మ ఆడించొచ్చు అని అని రుద్ తో సాధ్యమవుతుంది. థియేటర్లో ప్రేక్షకుడు బోర్ ఫీల్ అవ్వకుండా కూర్చున్నాడు? అంటే అది అనిరుద్ మ్యూజిక్ మ్యాజిక్ తోనే అన్నది కాదనలేని వాస్తవం. మరి ఈ నయా సంచలనం భవిష్యత్ లో ఇంకెలాంటి అద్భుతాలు చేస్తాడో చూడాలి.
