Begin typing your search above and press return to search.

'కూలీ' కోసం అతడి ఒంటరి పోరాటం..!

తమిళ్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ 'కూలీ' సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు.

By:  Tupaki Desk   |   2 Jun 2025 2:00 PM IST
కూలీ కోసం అతడి ఒంటరి పోరాటం..!
X

తమిళ్ సూపర్‌ స్టార్ రజనీకాంత్‌ 'కూలీ' సినిమా షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు రెడీ అవుతోంది. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమాను ఆగస్టు 15న విడుదల చేయబోతున్నారు. బ్యాక్ టు బ్యాక్‌ భారీ విజయాలను సొంతం చేసుకున్న లోకేష్ కనగరాజ్‌ కూలీ సినిమాతో మరోసారి పాన్ ఇండియా రేంజ్‌లో భారీ విజయాన్నిసొంతం చేసుకుంటాడనే విశ్వాసం వ్యక్తం అవుతోంది. కూలీ సినిమాలో రజనీకాంత్‌ లుక్‌తో పాటు, ఆయన మార్క్ స్టైల్‌ సీన్స్ ఆకట్టుకోబోతున్నాయి అంటూ అభిమానులు చాలా నమ్మకంగా ఉన్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్‌, గ్లిమ్స్‌ వీడియోలు సినిమాపై ఆసక్తిని పెంచాయి. అయితే రజనీకాంత్‌, లోకేష్ కూలీ సినిమా ప్రమోషన్స్ విషయంలో పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.

సినిమా విడుదలకు దాదాపు రెండున్నర నెలల సమయం ఉన్న కారణంగా ఇప్పటి నుంచే ఏముందిలే అనుకున్నారో ఏమో చిత్ర యూనిట్‌ సభ్యుల్లో చాలా మంది కూలీ గురించి కనీసం మాట్లాడటం లేదు. కానీ సంగీత దర్శకుడు అనిరుథ్‌ రవిచందర్‌ మాత్రం సందు దొరికితే చాలు కూలీ సినిమాను ప్రమోట్‌ చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎక్కడ మీడియా ముందుకు వచ్చినా తన కూలీ సినిమా గురించి అనిరుథ్‌ మాట్లాడుతూ ఉన్నాడు. తన అభిమాన హీరో రజనీకాంత్‌ సర్‌ సినిమా కూలీ ప్రమోషన్ బాధ్యతను పూర్తిగా తన భుజాలపై అనిరుధ్‌ వేసుకున్నాడు. అందులో భాగంగానే ఇటీవల ఒక ఈవెంట్‌లో కూలీ సినిమాలోని పాటను ప్రత్యేకంగా షో చేశాడు.

కొన్ని రోజుల క్రితమే అనిరుధ్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ ద్వారా 100 రోజుల్లో కూలీ సినిమా రాబోతుంది అంటూ ప్రకటించాడు. కౌంట్‌ డౌన్‌ షురూ చేసిన అనిరుధ్‌ షేర్ చేసిన వీడియో ఆ సమయంలో వైరల్‌ అయింది. తాజాగా అరంగం అతిరట్టుమ్‌ అనే పాటను తన మ్యూజికల్‌ ఈవెంట్‌లో పాడటం ద్వారా అభిమానులకు కూలీని మరింతగా షేర్ చేశాడు. అనిరుధ్‌ ఇటీవల తన సోషల్‌ మీడియా ప్లాట్‌ఫాం ద్వారా రెగ్యులర్‌గా కూలీ సినిమాకు సంబంధించిన షేర్‌ చేస్తూ వస్తున్నాడు. సమయానుసారం కూలీ సినిమా నుంచి అభిమానులను ఉత్సాహ పరుస్తూ పోస్టర్స్‌, వీడియోలను షేర్‌ చేయడం ద్వారా అన్ని వర్గాల వారిని ఆకర్షిస్తూ వస్తున్నాడు.

రజనీకాంత్‌ కూలీ సినిమాలో నాగార్జునతో పాటు ఉపేంద్ర, సత్యరాజ్‌, శివ కార్తికేయన్‌ తదితరులు గెస్ట్‌ రోల్స్‌లో కనిపించబోతున్నారు. శృతి హాసన్‌ ఈ సినిమాలో హీరోయిన్‌గా నటించిన విషయం తెల్సిందే. కళానిథి మారన్‌ ఈ సినిమాను దాదాపుగా రూ.350 కోట్ల బడ్జెట్‌తో నిర్మిస్తున్న విషయం తెల్సిందే. రజనీకాంత్‌కి ఉన్న మార్కెట్‌ నేపథ్యంలో ఈ సినిమా విడుదలకు ముందే రూ.500 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. రజనీకాంత్‌ ప్రస్తుతం జైలర్‌ 2 సినిమా షూటింగ్‌లో బిజీగా ఉన్న కారణంగా కూలీ సినిమాకు సంబంధించిన ప్రమోషన్‌లో ఆయన పట్టించుకునే పరిస్థితి కనిపించడం లేదు. వచ్చే నెలలో సినిమా ప్రమోషన్‌లో రజనీకాంత్‌ పాల్గొనే అవకాశాలు ఉన్నాయి.