Begin typing your search above and press return to search.

'విశ్వంభ‌ర' ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా!

ఆపై జులై నుంచి పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్టాల‌ని ప్ర‌ణాళిక వేస్తున్నారుట‌.

By:  Tupaki Desk   |   22 April 2024 2:30 PM GMT
విశ్వంభ‌ర ఇంట‌ర్వెల్ బ్యాంగ్ అదిరిపోయేలా!
X

మెగాస్టార్ చిరంజీవి 156వ చిత్రం 'విశ్వంభ‌ర' శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్ప‌టికే మూడు ..నాలుగు షెడ్యూళ్ల షూటింగ్ పూర్త‌యింది. ఆ లెక్క‌న మొత్తంగా చిత్రీక‌ర‌ణ‌లో భాగంగా 50 శాతం షూటింగ్ పూర్త‌యింద‌ని స‌మాచారం. మిగిలిన 50 శాతం జూన్ క‌ల్లా పూర్తయ్యేలా ద‌ర్శ‌కుడు వ‌షిష్ట ప్లాన్ చేస్తున్నారు. ఆపై జులై నుంచి పోస్ట్ ప్రొడక్ష‌న్ ప‌నులు మొద‌లు పెట్టాల‌ని ప్ర‌ణాళిక వేస్తున్నారుట‌.

తాజాగా సినిమాకి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ అందింది. ప్ర‌స్తుతం ఇంట‌ర్వెల్ బ్యాంగ్ లో వ‌చ్చే ఫైట్ రూపొందిస్తున్నారు. ఈ ఫైట్ కోసం 26 రోజుల కేటాయించారు. ఈ ఫైట్ స‌న్నివేశం చిత్రీక‌ర‌ణ ఈరోజుతో పూర్తవుతుందిట‌. ఓ ఫైట్ స‌న్నివేశాన్ని ఇన్ని రోజుల పాటు తెర‌కెక్కించ‌డం అన్న‌ది చిరంజీవి కెరీర్ లో ఇదే తొలిసారి. ఏ స‌న్నివేశం కోసం క‌ష్ట‌ప‌డ‌నంతో ఈ ఫైట్ సీక్వెన్స్ కోసం చిరు శ్ర‌మించిన‌ట్లు తెలుస్తోంది. రామ్ ల‌క్ష్మ‌ణ్ ఆధ్వ‌ర్యంలో ఈయాక్ష‌న్ స‌న్నివేశాన్ని చిత్రీక‌రిస్తున్నారుట‌. అలాగే ఈ ఫైట్ కోసం 54 అడుగుల హనుమాన్ విగ్రహాన్ని క్రియేట్ చేశారు.

అయితే ఈ ఫైట్ స‌న్నివేశం ఏ.ఎస్‌.ప్ర‌కాష్ ఆధ్వ‌ర్యంలో రూపొందించిన ఓ భారీ సెట్ లో చేయ‌డం విశేషం. సినిమాకే కాదు, టాలీవుడ్ చరిత్ర‌లోనే క‌నీ వినీ ఎరుగ‌ని రీతిలో ఈ ఫైట్ ఉంటుంద‌ని చిత్ర వ‌ర్గాలు ధీమా వ్య‌క్తం చేస్తున్నాయి. దీంతో సైరా న‌ర‌సింహారెడ్డి త‌ర్వాత మ‌ళ్లీ చిరంజీవి ఎక్కువ ఎఫెర్ట్ పెట్టి చేస్తోన్న సినిమాగా చెప్పొచ్చు. కంబ్యాక్ త‌ర్వాత క‌మ‌ర్శియ‌ల్ సినిమాలు చేసిన చిరు కెరీర్ లో సైరా ఓ డిఫ‌రెంట్ అటెంప్ట్.

అన్ని ప‌నులు పూర్తిచేసి 2025 సంక్రాంతి కానుక‌గా రిలీజ్ చేస్తామ‌ని ముందే చెప్పేసారు. అంటే జులై నుంచి డిసెంబ‌ర్ వ‌ర‌కూ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులే జ‌రుగుతాయ‌ని తెలుస్తోంది. ఆరు నెల‌లు పాటు సినిమాకి సంబంధించి నిర్మాణానంతర పనుల‌కే కేటాయించిన‌ట్లు అవుతుంది. `విశ్వంభ‌ర` సోషియా ఫాంట‌సీ చిత్రం కావడంతోనే ఇంత స‌మ‌యం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కి కేటాయించాల్సి వ‌స్తోంద‌ని తెలుస్తోంది. సినిమాలో గ్రాఫిక్స్ ఎక్కువగా ఉంటాయి. ఓ కొత్త ప్ర‌పంచంలోకి తీసుకెళ్లే కాన్సెప్ట్ కావ‌డంతోనే ఇదంతా క‌నిపిస్తుంది.