Begin typing your search above and press return to search.

యానిమల్.. ఆ విషయంలో అసలు టెన్షన్ లేదట

సుమారు 3 గంటల 21 నిమిషాల రన్ టైం తో ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుందని దర్శకుడు సందీప్ వంగా స్వయంగా రివీల్ చేయడంతో చాలా మంది సినిమాపై అనుమానాలు వ్యక్తం చేశారు.

By:  Tupaki Desk   |   27 Nov 2023 7:09 AM GMT
యానిమల్.. ఆ విషయంలో అసలు టెన్షన్ లేదట
X

అర్జున్ రెడ్డి మూవీ ఫేమ్ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన 'యానిమల్' మూవీ భారీ రన్ టైం తో వస్తుందనే విషయం తెలిసిందే. సుమారు 3 గంటల 21 నిమిషాల రన్ టైం తో ఈ సినిమా థియేటర్స్ లో విడుదల కాబోతుందని దర్శకుడు సందీప్ వంగా స్వయంగా రివీల్ చేయడంతో చాలా మంది సినిమాపై అనుమానాలు వ్యక్తం చేశారు.

ఇంత నిడివిని ఆడియన్స్ యాక్సెప్ట్ చేసి థియేటర్స్ లో సినిమాని ఎంజాయ్ చేయగలరా అనే సందేహాలు వ్యక్తం చేశారు. తాజాగా ఈ సందేహాలపై దర్శకుడు సందీప్ రెడ్డి వంగా స్పందించారు. ఈ సందర్భంగా తన గత చిత్రం అర్జున్ రెడ్డి సినిమాని ప్రస్తావించాడు.

"సినిమాకి భారీ రన్ టైం అనేది ఇబ్బంది కాదు. అర్జున్ రెడ్డి 3 గంటల 6 నిమిషాలు ఉంటుంది. అది ఒక అబ్బాయి అమ్మాయి కథ మాత్రమే. కానీ యానిమల్ లో ఒక కుటుంబం, ప్రత్యర్థులు అంటూ చాలా లేయర్స్ ఉన్నాయి. అర్జున్ రెడ్డి కంటే జస్ట్ 15 నిమిషాలు ఎక్కువ ఉంటుంది. కాబట్టి మరో పది నిమిషాలు హాయిగా ఏసీలో కూర్చుని సినిమాను ఎంజాయ్ చేస్తారనే నమ్మకం నాకుంది" అంటూ యానిమల్ రన్ టైం పై తన కాన్ఫిడెన్స్ ను వ్యక్తపరిచాడు సందీప్ వంగా.

3 గంటల 21 నిమిషాల రన్ టైం తో ఈ మధ్యకాలంలో మరే సినిమా రాలేదు. కంటెంట్ పై నమ్మకంతోనే మేకర్స్ నిడివిని పెద్దగా పట్టించుకోవడం లేదు. ఇక తాజాగా యానిమల్ రన్ టైం విషయంలో సందీప్ రెడ్డి చేసిన కామెంట్స్ ని కొందరు సపోర్ట్ చేస్తుంటే మరి కొందరు మరీ అంత ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు అంటూ చెబుతున్నారు. మరోవైపు ఇప్పటికే యానిమల్ ట్రైలర్ ఆడియన్స్ కి విపరీతంగా నచ్చేసింది. ట్రైలర్ ని బట్టి చూస్తే సినిమాలో ఆడియన్స్ ని మెప్పించే కంటెంట్ ఉందనే అనిపిస్తోంది.

ముఖ్యంగా యాక్షన్ లవర్స్ ఈ మూవీ కోసం ఎంతో ఆత్రుతగా ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం మూవీ టీం వరుస ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు. డిసెంబర్ 1న హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్ బ్యానర్లపై భూషణ్ కుమార్, ప్రణయ్ రెడ్డి వంగ ఈ చిత్రాన్ని సంయుక్తంగా నిర్మిస్తున్నారు.