Begin typing your search above and press return to search.

యానిమాల్.. కోత మొదలైంది!

కేవలం కొన్ని సీన్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు అంటే ఇక సినిమా మొత్తంలో కూడా అంతకుమించి అనేలా కిక్ ఇవ్వబోతున్నారు అని ఫ్యాన్స్ అయితే నమ్మకంతో ఉన్నారు.

By:  Tupaki Desk   |   25 Nov 2023 1:30 AM GMT
యానిమాల్.. కోత మొదలైంది!
X

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కిన యానిమల్ సినిమాలో రణబీర్ కపూర్ కంప్లీట్ డిఫరెంట్ హై వోల్టేజ్ క్యారెక్టర్ తో కనిపించబోతున్నాడు అని ట్రైలర్ తోనే ఒక క్లారిటీ వచ్చేసింది. కేవలం కొన్ని సీన్స్ తోనే సెన్సేషన్ క్రియేట్ చేశారు అంటే ఇక సినిమా మొత్తంలో కూడా అంతకుమించి అనేలా కిక్ ఇవ్వబోతున్నారు అని ఫ్యాన్స్ అయితే నమ్మకంతో ఉన్నారు.

దర్శకుడు కూడా సోషల్ మీడియాలో మరింత పాజిటివ్ వైబ్రేషన్స్ క్రియేట్ చేస్తున్నాడు. కేవలం ఇది టిఫిన్ లాంటిది మాత్రమే అని ఫుల్ మీల్స్ వెండి తెరపై కనిపించబోతోంది అన్నట్లుగా రియాక్ట్ అవుతున్నాడు. దీంతో ఆడియోన్స్ కూడా ఈ సినిమాను మొదటి రోజు మొదటి షో చూడడానికి ఆసక్తిని చూపిస్తున్నారు. ఇక టీజర్ ట్రైలర్ విడుదలైన కొన్ని గంటల తర్వాత కొన్ని ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్ ఓపెన్ అయ్యాయి.

గురువారం రోజు హైదరాబాదులో కూడా కొన్ని సెంటర్లలో బుకింగ్స్ మొదలైపోయాయి. ఇక కొన్ని గంటలలోనే 5 వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోయాయని తెలుస్తోంది. దీన్ని బట్టి సినిమాపై బజ్ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. కేవలం బాలీవుడ్ లోనే కాకుండా ఇతర ఇండస్ట్రీలో కూడా ఈ సినిమాకు మంచిగా ఓపెనింగ్స్ వచ్చే అవకాశం ఉంది.

అయితే ఓవర్సీస్ లో బజ్ కూడా గట్టిగానే ఉంది. యూఎస్ కెనడాలో కూడా సినిమాకు అడ్వాన్స్ బుకింగ్స్ ఒక సరికొత్త రికార్డు క్రియేట్ చేసే అవకాశం ఉంది. జనవరి 26 నుంచి అన్ని ఏరియాలలో అడ్వాన్స్ బుకింగ్ మొదలు కాబోతున్నాయి. దీంతో సినిమా లవర్స్ ఫస్ట్ డే ఫస్ట్ షో చూడడానికి టికెట్లు బుక్ చేసుకోవాలి అని ఫిక్స్ అయ్యారు.

ఇక యానిమాల్ సినిమాలో రణబీర్ కు జోడిగా రష్మిక మందన్న నటించింది. ఈ సినిమాతో కూడా ఆమె సాలిడ్ సక్సెస్ అందుకొని బాలీవుడ్లో మరింత బిజీ అవ్వాలని చూస్తోంది. ఇప్పటికే రణబీర్ కపూర్ కూడా బ్రహ్మాస్త్ర సినిమాతో తెలుగులో పరవాలేదు అనిపించేలా కలెక్షన్స్ అందుకున్నాడు. ఇక ఇప్పుడు యానిమల్ సినిమాతో పూర్తి స్థాయిలో పట్టు సాధించాలని అనుకుంటున్నాడు. మరి ఈ సినిమా ఎలాంటి సక్సెస్ మీ ఇస్తుందో చూడాలి.