Begin typing your search above and press return to search.

బాలయ్య షోలో యానిమల్ టీం.. ఇరకాటంలో రష్మిక ..!

యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ హీరో రణ్ బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న ఈ షోకి వచ్చారు.

By:  Tupaki Desk   |   18 Nov 2023 11:48 AM GMT
బాలయ్య షోలో యానిమల్ టీం.. ఇరకాటంలో రష్మిక ..!
X

నందమూరి బాలకృష్ణ హోస్ట్ గా సూపర్ హిట్ అయిన షో అన్ స్టాపబుల్. ఆహా లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ షో రెండు సక్సెస్ ఫుల్ సీజన్ లను పూర్తి చేసుకోగా మూడో సీజన్ ఎప్పుడెప్పుడు మొదలవుతుందా అని ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు. అన్ స్టాపబుల్ సీజన్ 3 ఏమో కానీ స్పెషల్ ఎపిసోడ్స్ మాత్రం సర్ ప్రైజ్ చేస్తున్నాయి. ఆమధ్య భగవంత్ కేసరి రిలీజ్ టైం లో అన్ స్టాపబుల్ స్పెషల్ ఎడిషన్ చేయగా లేటెస్ట్ గా యానిమల్ టీం తో అన్ స్టాపబుల్ షో చేశారు.

యానిమల్ డైరెక్టర్ సందీప్ వంగ హీరో రణ్ బీర్ కపూర్, హీరోయిన్ రష్మిక మందన్న ఈ షోకి వచ్చారు. ఎప్పటిలానే బాలయ్య తన ఎనర్జిటిక్ హోస్టింగ్ తో అదరగొట్టారు. రణ్ బీర్ కపూర్ కూడా బాలకృష్ణ తో కలిసి ఆడి పాడారు. డోంట్ ట్రబుల్ ద ట్రబుల్ డైలాగ్ చెప్పి బాలయ్యకి షాక్ ఇచ్చాడు. అంతేకాదు ఫ్లూటు జింక ముందు ఊదు సింహం ముందు కాదు అంటూ చెప్పాడు.

ఇక మరోపక్క రష్మికతో సరదా సంభాషణలు చేశారు బాలకృష్ణ. ఈ క్రమంలో ఆమె ని విజయ్ దేవరకొండని కాల్ చేయమనగా ఆమె చేస్తుంది. ఈ ఎపిసోడ్ లో విజయ్ తో రష్మిక ఏం మాట్లాడాడు అన్నది ఆసక్తికరంగా మారింది. అంతేకాదు బాలకృష్ణ విజయ్ తో ఏం మాట్లడాడు అన్నది కూడా ఇంట్రెస్టింగ్ గా అనిపిస్తుంది. రీసెంట్ గా రిలీజైన ఈ ఎపిసోడ్ ప్రోమో ఆడియన్స్ దగ్గర నుంచి సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.

సందీప్ వంగ డైరెక్షన్ లో రణ్ బీర్ కపూర్, రష్మిక జంటగా నటించిన సినిమా యానిమల్. ఈ సినిమా డిసెంబర్ 1న వరల్డ్ వైడ్ రిలీజ్ అవుతుంది. హిందీతో పాటుగా ఈ సినిమాను సౌత్ లో కూడా భారీగా రిలీజ్ చేస్తున్నారు. సినిమా ప్రమోషన్స్ లో భాగంగా అన్ స్టాపబుల్ షోకి వచ్చారు యానిమల్ టీం. సందీప్ వంగ తో ఈవెనింగ్ ఏం చేస్తావ్ అంటే అప్పుడప్పుడు విస్కీ అని సందీప్ ఆన్సర్ ఇస్తే నా బ్రాండ్ కి మారిపో నీకు ఇంకా బాగా కథలు వస్తాయని సలహా ఇస్తారు బాలకృష్ణ. మొత్తానికి అన్ స్టాపబుల్ ప్రోమో అదరగొట్టేసింది. ఫుల్ ఎపిసోడ్ కోసం ఆడియన్స్ అంతా ఈగర్ గా ఎదురుచూస్తున్నారు.