Begin typing your search above and press return to search.

'యానిమల్‌' స్టార్‌ కన్నీళ్లు.. వీడియో వైరల్‌

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న, తెలుగు దర్శకుడు సందీప్ వంగ కాంబోలో వచ్చిన యానిమల్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.

By:  Tupaki Desk   |   4 Dec 2023 9:49 AM GMT
యానిమల్‌ స్టార్‌ కన్నీళ్లు.. వీడియో వైరల్‌
X

బాలీవుడ్‌ స్టార్‌ హీరో రణబీర్ కపూర్‌, నేషనల్‌ క్రష్‌ రష్మిక మందన్న, తెలుగు దర్శకుడు సందీప్ వంగ కాంబోలో వచ్చిన యానిమల్ సినిమాకు ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. సినిమాను ఓవరాల్‌ గా చూడకుండా కంటెంట్‌ మరియు ఇతర విషయాల గురించి ప్రేక్షకులు మరియు నెటిజన్స్‌ మాట్లాడుకుంటూ ఉన్నారు.

సినిమాలో నటీ నటుల నటన గురించి ప్రధానంగా కొందరు మాట్లాడుకుంటూ ఉన్నారు. రణబీర్ కపూర్ యాక్టింగ్‌, రష్మిక మందన్న అందం మరియు బాబీ డియోల్‌ లుక్ మరియు నటన గురించి చాలా మంది మాట్లాడుకుంటూ యానిమల్ సినిమా కు మౌత్‌ పబ్లిసిటీ ప్రచారం చేస్తున్నారు అనడంలో సందేహం లేదు.

తాజాగా యానిమల్‌ సినిమాలో కీలక పాత్రలో కనిపించిన బాబీ డియోల్‌ ముంబైలో యానిమల్‌ ప్రదర్శింపబడుతున్న ఒక థియేటర్‌ కి వెళ్లాడు. అక్కడ ప్రేక్షకుల నుంచి వచ్చిన స్పందన చూసి ఆనందం వ్యక్తం చేశాడు. చాలా ఏళ్లుగా ఇలాంటి స్పందన కోసం వెయిట్‌ చేస్తున్నాను అంటూ అక్కడున్న ప్రేక్షకులు మరియు ఫ్యాన్స్ తో మాట్లాడిన సందర్భంగా వ్యాఖ్యలు చేశాడు

థియేటర్ నుంచి బయటకు వచ్చి కారు ఎక్కిన తర్వాత చమర్చిన కళ్లను తూడ్చుకుంటూ కెమెరా కళ్లకు చిక్కాడు. యానిమల్‌ సినిమా కోసం బాబీ డియోల్‌ చాలా కష్టపడ్డాడు. అందుకు తగ్గ ఫలితం వచ్చింది అనడంలో సందేహం లేదు. ఒకప్పడు స్టార్‌ గా వెలుగు వెలిగిన బాబీ డియోల్‌ ఈ మధ్య కాలంలో కాస్త డల్‌ అయ్యాడు.

యానిమల్‌ సినిమా బాబీ డియోల్‌ కి కచ్చితంగా బూస్ట్‌ ను ఇచ్చేదిగా ఉంది. యానిమల్‌ సినిమా లోని బాబీ డియోల్‌ లుక్ కి అంతా ఫిదా అయ్యారు. అంతే కాకుండా యానిమల్ తర్వాత బాబీ డియోల్‌ కు సౌత్‌ నుంచి ముఖ్యంగా తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఆఫర్లు వరుసగా వస్తున్నాయని సమాచారం.