Begin typing your search above and press return to search.

యానిమాల్.. అంత రిస్క్ చేసే దమ్ముందా?

ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఆ రేంజ్ లో ఉండదు కానీ సందీప్ రెడ్డి వంగ స్టైల్ కు తగ్గట్టుగానే రెండు గంటల 50 నిమిషాలకు పైగానే ఉంటుందని కామెంట్స్ కూడా వస్తున్నాయి.

By:  Tupaki Desk   |   31 Oct 2023 3:16 PM GMT
యానిమాల్.. అంత రిస్క్ చేసే దమ్ముందా?
X

అర్జున్ రెడ్డి దర్శకుడు సందీప్ రెడ్డి వంగా నుంచి రాబోతున్న నెక్స్ట్ సినిమా యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి రిజల్ట్ అందుకుంటుందో కానీ దానికంటే ముందు ఈ సినిమా క్రియేట్ చేస్తున్న హడావిడి మాత్రం మామూలుగా లేదు. దర్శకుడు సందీప్ ఎప్పటిలానే తనదైన శైలిలోనే సినిమాకు బజ్ పెరిగే విధంగా కంటెంట్ అయితే వదులుతున్నాడు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు సినిమా ఎలా ఉండబోతుంది అనే విషయంలో ఒక క్లారిటీ ఇచ్చాయి.

అంతేకాకుండా రొమాంటిక్ డోస్ కూడా గట్టిగానే ఉండబోతున్నట్లు క్లారిటీ వచ్చేసింది. కానీ విడుదలైన పాటలు ఏవి కూడా అనుకున్నంత స్థాయిలో అయితే క్లిక్ కాలేదు. ఇక సినిమా కంటెంట్ ఎలా ఉంటుందో అనే విషయం కన్నా ఇప్పుడు నిడివి గురించి అనేక రకాలుగా గాసిప్స్ వస్తున్నాయి. ఈ సినిమా రన్ టైం దాదాపు మూడు గంటల పదిహేను నిమిషాలకు పైగా ఉంటుంది అన్నట్లుగా బాలీవుడ్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి.

ఇక లేటెస్ట్ సమాచారం ప్రకారం అయితే ఆ రేంజ్ లో ఉండదు కానీ సందీప్ రెడ్డి వంగ స్టైల్ కు తగ్గట్టుగానే రెండు గంటల 50 నిమిషాలకు పైగానే ఉంటుందని కామెంట్స్ కూడా వస్తున్నాయి. అంతేకాకుండా రెండు ఇంటర్వెల్స్ ఉండే విధంగా దర్శకుడు అనుకున్నాడు అని మరికొన్ని గాసిప్స్ వైరల్ అయ్యాయి. ఇక అందులో కూడా నిజం లేదు అని తెలుస్తుంది.

ఈ రోజుల్లో కంటెంట్ ఎంత కొత్తగా ఉన్నా.. అలాగే ఎంటర్టైన్మెంట్ గా అనిపించినా కూడా ప్రేక్షకులు రెండున్నర గంటలు కంటే ఎక్కువగా థియేటర్లో ఉండడానికి ఇష్టపడడం లేదు. ఇక వారిని అంతకంటే ఎక్కువ సేపు కూర్చోబెట్టడం చాలా రిస్క్. కంటెంట్ లో ఏమాత్రం స్లోగా అనిపించినా కూడా మొదటికే మోసం వచ్చే అవకాశం ఉంది. రీసెంట్గా టైగర్ నాగేశ్వరరావు నిడివి విషయంలో కూడా ఇదే మైనస్ అయింది.

దర్శకుడు ప్రతి సన్నివేశాన్ని వెండి తెరపై ఉంచాలి అనుకుంటే అది అంత సులువు కాదు. ఇక ఆడియన్స్ కు ఫైనల్ గా తక్కువ రన్ టైం తో బెస్ట్ గా చూపిస్తే సరిపోతుంది. ఓటీటీ ఆప్షన్ ఎలాగు ఉంది కాబట్టి అప్పుడు పూర్తి స్థాయిలో నిడివి ఉన్న సినిమాను విడుదల చేసుకుంటే సరిపోతుంది. మరి యానిమల్ సినిమా రన్ టైమ్ విషయంలో సందీప్ రెడ్డి ఏ విధంగా ఆలోచిస్తాడో చూడాలి.