Begin typing your search above and press return to search.

యానిమ‌ల్ పార్క్ ప‌నులు అప్పుడేనా?

అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అన్న‌ది క్లారిటీ లేదు. ఈనేప‌థ్యంలో తాజాగా దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైర‌ల్ అవుతోంది.

By:  Tupaki Desk   |   1 Feb 2024 2:30 AM GMT
యానిమ‌ల్ పార్క్ ప‌నులు అప్పుడేనా?
X

ర‌ణ‌బీర్ క‌పూర్-సందీప్ రెడ్డి 'యానిమ‌ల్' ఎలాంటి సంచ‌ల‌నం న‌మోదు చేసిందో తెలిసిందే. బాక్సాఫీస్ వ‌ద్ద 900 కోట్ల‌కు పైగా వ‌సూళ్లు సాధించి బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచింది. కేవ‌లం కంటెంట్..ర‌ణ‌బీర్ స‌హ ఇత‌ర నటీనటులు..సందీప్ మేకింగ్ తోనే ఇది సాద్య‌మైంది. బ‌ల‌మైన పాత్ర‌ల్ని తెర‌పై ఆవిష్క‌రించ‌డంతోనే ఇంత పెద్ద స‌క్సెస్ అయింది. ఇక్క‌డ సందీప్ పెద్ద‌గా లాజిక్ ప్లే చేయ‌కుండా కేవ‌లం 'అర్జున్ రెడ్డి' త‌ర‌హా క్యారెక్ట‌రైజేష‌న్ తీసుకుని చేసిన చిత్ర‌మిది.

ఆ కార‌ణంగానే ప్రేక్ష‌కులు బ్ర‌హ్మ‌ర‌ధం ప‌ట్టిన సినిమా గా నిలిచింది. ఈ నేప‌థ్యంలో ఈసినిమాకి సీక్వెల్ గా 'యానిమ‌ల్' పార్క్ కూడా ప్ర‌క‌టించిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇది ఎప్పుడు ప్రారంభం అవుతుంది? అన్న‌ది క్లారిటీ లేదు. ఈనేప‌థ్యంలో తాజాగా దీనికి సంబంధించి ఇంట్రెస్టింగ్ అప్ డేట్ వైర‌ల్ అవుతోంది. ఈ సినిమా స్క్రిప్ట్ ప‌నులు సందీప్ ఫిబ్ర‌వ‌రి నుంచి మొద‌లు పెడ‌తారుట‌.

ప్లాట్ సిద్దంగా ఉన్న నేప‌థ్యంలో దాన్ని ఆధారంగా చేసుకుని స్టోరీ మొత్తం పూర్తి చేయాల‌ని భావిస్తున్నాడుట‌. ఈ స్టోరీ సిద్ద‌మైన త‌ర్వాత కొంత విశ్రాంతి తీసుకుంటాడ‌ని తెలుస్తోంది. అటుపై స్పిరిట్ ప‌నుల్లో బిజీ అవుతాడు. ఇప్ప‌టికే క‌థ సిద్దంగా ఉంది. కానీ ప్ర‌భాస్ బిజీగా ఉండ‌టంతో అదే క‌థ‌కి మెరుగులు దిద్దుతున్నాడు. తాజాగా సందీప్ బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తోనూ సినిమా చేస్తాడ‌ని.. ప్ర‌భాస్ సినిమాకంటే ముందుగానే ప్రారంభమ‌వుతుంద‌ని ఓ ప్ర‌చారం తెర‌పైకి వ‌చ్చింది.

అయితే అందులో వాస్త‌వం ఎంతో తెలియాలి. అలాగే 'యానిమ‌ల్ పార్క్' ప్రారంభం కావ‌డానికి స‌మ‌యం ప‌డుతుంది. ఈ లోగా రణబీర్ కపూర్ రెండు భారీ ప్రాజెక్ట్స్ ని పూర్తి చేయనున్నాడు. అయితే పార్క్ లో హీరోయిన్ గా ర‌ష్మిక‌ని రిపీట్ చేస్తాడా? కొత్త భామ‌ని తీసుకుంటాడా? అన్న‌ది స‌స్పెన్స్. అందుకు ఇంకా చాలా స‌మ‌యం ఉంది. ప్ర‌స్తుతం సందీప్ కాన్సంట్రేష‌న్ అంతా పెండింగ్ లో ఉన్న స్టోరీల్నీ సిద్దం చేయ‌డంపేనే ఉంది.