Begin typing your search above and press return to search.

'యానిమల్ పార్క్'.. వచ్చేది అప్పుడే?

తాజాగా ఈ సీక్వెల్ గురించి డైరెక్టర్ సందీప్ వంగ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు." యానిమల్ పార్క్ లో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి.

By:  Tupaki Desk   |   8 Dec 2023 5:30 PM GMT
యానిమల్ పార్క్.. వచ్చేది అప్పుడే?
X

అర్జున్ రెడ్డి మూవీతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగా తాజాగా థియేటర్స్ లో రిలీజ్ అయిన 'యానిమల్' తో బాలీవుడ్ లో సత్తా చాటాడు. రణ్ బీర్ కపూర్, రష్మిక మందన జంటగా నటించిన ఈ మూవీ డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా స్థాయిలో విడుదలై కలెక్షన్ల వర్షం కురిపిస్తుంది. ముఖ్యంగా నార్త్ ఆడియన్స్ ఈ సినిమాపై చూపిస్తున్న ఆదరణ అంతా ఇంతా కాదు. తన ఫిలిం మేకింగ్ తో సందీప్ వంగ మరోసారి అందరి దృష్టిని ఆకర్షించి టాక్ ఆఫ్ ద ఇండస్ట్రీ గా మారాడు.

భారీ అంచనాలతో విడుదలైన యానిమల్ బాక్సాఫీస్ వద్ద ఊహించని విజయాన్ని అందుకుంది. ముఖ్యంగా యాక్షన్ లవర్ కు ఐ ఫీస్ట్ ఇచ్చిన ఈ మూవీకి సీక్వెల్ కూడా కాబోతున్న విషయం తెలిసిందే. యానిమల్ మూవీ చివర్లో ఈ విషయాన్ని సందీప్ వంగ రివిల్ చేశాడు. 'యానిమల్ పార్క్' అనే పేరుతో ఈ సీక్వెల్ ఉండబోతుంది. ఈ సీక్వెల్ ఎలా ఉండబోతుందో యానిమల్ పోస్ట్ క్రెడిట్ సీన్ లో హింట్ ఇచ్చాడు.

అది చూసిన ఆడియన్స్ యానిమల్ కంటే యానిమల్ పార్క్ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుందని ఫిక్స్ అయిపోయారు. దీంతో యానిమల్ సీక్వెల్ ఫై సర్వత్ర ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ సీక్వెల్ గురించి డైరెక్టర్ సందీప్ వంగ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు." యానిమల్ పార్క్ లో మరిన్ని బలమైన పాత్రలు ఉంటాయి. అలాగే గతంలో వచ్చిన సినిమాల కంటే ఎక్కువ థ్రిల్ పంచడమే యానిమల్ పార్క్ లక్ష్యం. ఊహించని యాక్షన్ సీన్స్ ఉంటాయి. రణబీర్ పాత్ర మరింత క్రూరంగా ఉంటుందని" అన్నారు.

అంతేకాకుండా ప్రభాస్, అల్లు అర్జున్ ప్రాజెక్ట్స్ ని కంప్లీట్ చేసి 2026 లో యానిమల్ పార్క్ ని సెట్స్ పైకి తీసుకెళ్లబోతున్నట్లు సందీప్ రెడ్డి వంగ స్వయంగా వెల్లడించాడు. అంటే యానిమల్ సీక్వెల్ కోసం 2026 వరకు ఎదురుచూడాల్సిందే. కాగా ప్రస్తుతం థియేటర్స్ లో సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్న యానిమల్ మూవీ కేవలం 6 రోజుల్లో రూ.500 కోట్ల క్లబ్ లో చేరింది.

వరల్డ్ వైడ్ గా ఈ మూవీ రూ.527 కోట్ల 60 లక్షల గ్రాస్ ని కలెక్ట్ చేసి రూ.1000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇక తెలుగులోనూ ఈ సినిమా అదరగొడుతోంది. కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే రూ.15 కోట్ల థియేట్రికల్ బిజినెస్ చేసిన ఈ సినిమా ఆ మొత్తాన్ని మొదటి వీకెండ్ లోపే అందుకోవడం విశేషం ఇక హిందీలో ఈ మూవీ రూ.300 కోట్ల మార్క్ కి చేరువలో ఉంది.