Begin typing your search above and press return to search.

యానిమాల్ పార్క్ లోకి మరో క్రూరమైన రోల్?

ఇక యానిమల్ పార్క్ లో మిగతా క్రూరమైన పాత్రలు కూడా గట్టిగానే ఉండబోతాయని చెప్పకనే చెప్పేశారు. ఇప్పటికే కొంతమంది హీరోల పేర్లు కూడా బాగా వైరల్ అయ్యాయి.

By:  Tupaki Desk   |   1 March 2024 8:20 AM GMT
యానిమాల్ పార్క్ లోకి మరో క్రూరమైన రోల్?
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరపైకి వచ్చిన యానిమల్ సినిమా ఎలాంటి రికార్డులను క్రియేట్ చేసిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే కాకుండా బాలీవుడ్ లోనూ ఈ సినిమా ప్రకంపనలు సృష్టించింది. గతంలో ఎప్పుడో లేనంత హై వోల్టేజ్ యాక్షన్ ను దర్శకుడు ఈ సినిమాలో హైలెట్ చేశాడు.

ఇక ఈ సినిమా లో ప్రతి క్యారెక్టర్ కూడా చాలా బాగా హైలైట్ అయింది. ఫాదర్ సెంటిమెంట్ తో పాటు యాక్షన్ ఎలిమెంట్స్ అలాగే లవ్ సీన్స్, బాబీ డియోల్ క్యారెక్టర్ కూడా సినిమాకు మేజర్ ప్లస్ పాయింట్ గా నిలిచాయి. దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఈ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని ముందుగానే క్లారిటీ ఇచ్చేశాడు. దానికి యానిమల్ పార్క్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు.

ఇక యానిమల్ పార్క్ లో మిగతా క్రూరమైన పాత్రలు కూడా గట్టిగానే ఉండబోతాయని చెప్పకనే చెప్పేశారు. ఇప్పటికే కొంతమంది హీరోల పేర్లు కూడా బాగా వైరల్ అయ్యాయి. ఇక సీక్వెల్ లో మరో రణబీర్ బీర్ కనిపిస్తాడు అని యానిమల్ చివర్లోనే తెలియజేశారు. ప్రస్తుతం వినిపిస్తున్న మరొక టాక్ ప్రకారం మరొక క్రూరమైన క్యారెక్టర్ కోసం బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నటుడిని సంప్రదిస్తున్నట్లుగా తెలుస్తోంది.

అతను మరెవరో కాదు కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్. ఉరి, సర్దార్ ఉద్దం సినిమాలతో మంచి గుర్తింపు అందుకున్న నటుడు కౌశల్ మరొక పవర్ఫుల్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నట్లుగా తెలుస్తోంది. దర్శకుడు సందీప్ ఇప్పటికే విక్కీ కౌశల్ ని కూడా సంప్రదించి స్టోరీ గురించి చెప్పినట్లుగా తెలుస్తోంది.

అయితే ప్రస్తుతం దర్శకుడు ప్రభాస్ కోసం స్పిరిట్ కథను పూర్తిస్థాయిలో సిద్ధం చేస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ త్వరలోనే మొదలుకానుంది. ఇక ఆ తర్వాత యానిమల్ సీక్వెల్ సెట్స్ పైకి వచ్చే అవకాశం ఉంది. ఈలోపు ముందుగానే క్యారెక్టర్స్ విషయంలో ఒక నిర్ణయానికి రావాలి అని సందీప్ ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది.

కౌశల్ కు కూడా ఈ విషయంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లుగా బాలీవుడ్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. మరి ఇది ఎంతవరకు నిజమో తెలియాలి అంటే మరికొంత కాలం ఆగాల్సిందే. ఇక ప్రస్తుతం విక్కీ కౌశల్ బాలీవుడ్ లోనే మరో రెండు ప్రాజెక్టులు చేస్తున్నాడు. ఇటీవల అతను షారుక్ ఖాన్ డుంకీ సినిమాలో కనిపించిన విషయం తెలిసిందే.