Begin typing your search above and press return to search.

ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ని టెన్షన్‌ పెడుతున్న యానిమల్‌ పార్క్‌!

యానిమల్‌ సినిమా విడుదల తర్వాత సందీప్ రెడ్డి వంగ వ్యూహం మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి

By:  Tupaki Desk   |   15 Dec 2023 3:30 PM GMT
ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ని టెన్షన్‌ పెడుతున్న యానిమల్‌ పార్క్‌!
X

అర్జున్‌ రెడ్డి ని మించి యానిమల్‌ సినిమాలో హీరో ను వైల్డ్ గా చూపించి యూత్ ఆడియన్స్ తో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులను కట్టిపడేసిన దర్శకుడు సందీప్ వంగ తదుపరి సినిమాగా స్పిరిట్‌ ను మొదలు పెట్టబోతున్నట్లుగా ఇప్పటికే ప్రకటించాడు. ప్రభాస్ తో స్పిరిట్‌ సినిమాను ప్రకటించి చాలా కాలం అయింది. యానిమల్ ను ముగించిన తర్వాత మాత్రమే స్పిరిట్‌ ఉంటుంది అన్నాడు.

యానిమల్‌ సినిమా విడుదల తర్వాత సందీప్ రెడ్డి వంగ వ్యూహం మారిందా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ఎందుకంటే యానిమల్ తర్వాత స్పిరిట్ అనుకున్న సందీప్ రెడ్డి వంగ మధ్య లో ఒక సినిమాను చేయాలని భావిస్తున్నాడు అని, ఆ సినిమా కూడా యానిమల్ లో భాగం అన్నట్లుగా టాక్‌ వినిపిస్తోంది.

బాలీవుడ్‌ వర్గాల వారు మరియు మీడియా సర్కిల్స్‌ నుంచి అందుతున్న సమాచారం ప్రకారం యానిమల్ సినిమా కు సీక్వెల్ గా సందీప్‌ వంగ ఒక సినిమాను రూపొందించేందుకు గాను స్క్రిప్ట్‌ ను రెడీ చేస్తున్నాడట. యానిమల్‌ కి సీక్వెల్‌ ను యానిమల్‌ పార్క్ గా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే విధంగా ప్లాన్‌ చేస్తున్నారని టాక్‌ వినిపిస్తోంది.

రణబీర్ కపూర్‌ ను క్లైమాక్స్ లో వైల్డ్‌ సన్నివేశంలో చూపించడం జరిగింది. ఆ పాత్రను సెంటర్ గా చేసుకుని సినిమా కథ ను అల్లుతున్నట్లుగా తెలుస్తోంది. యానిమల్‌ పార్క్‌ లో బాబీ డియోల్‌ ఉండక పోవచ్చు అనేది టాక్‌. ఇక సీక్వెల్‌ లో హీరోయిన్‌ మాళవిక మోహనన్‌ ఉంటుందనే వార్తలు వస్తున్నాయి.

మొత్తానికి యానిమల్‌ సీక్వెల్‌ గురించి ఎవరికి ఇష్టం వచ్చినట్లుగా వారు ఊహించేసుకుంటూ ఉన్నారు. కానీ ఇప్పటి వరకు దర్శకుడు అధికారికంగా మాత్రం యానిమల్‌ పార్క్‌ ఎప్పుడు అనేది క్లారిటీ ఇవ్వలేదు. స్పిరిట్‌ కంటే ముందు యానిమల్ పార్క్‌ ఉంటుందేమో అనే ఆందోళన ప్రభాస్‌ ను వెంటాడుతోంది.

స్పిరిట్‌ సినిమాను వచ్చే ఏడాదిలో మొదలు పెట్టి 2025 లో విడుదల చేస్తాడని ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్నారు. కానీ ఇప్పుడు సందీప్‌ రెడ్డి యానిమల్‌ పార్క్ ను మొదలు పెడితే కచ్చితంగా స్పిరిట్‌ ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయి. అందుకే ప్రభాస్‌ ఫ్యాన్స్ టెన్షన్‌ పడుతున్నారు. మరి సందీప్ రెడ్డి వంగ నిర్ణయం ఏంటో తెలియాల్సి ఉంది.