Begin typing your search above and press return to search.

'యానిమల్‌' పెద్ద ప్రమాదం తప్పించుకుందా?

ఆగస్టు నెలలో సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. దాంతో యానిమల్ కు గట్టి పోటీ ఉండేది అనేది కొందరి అభిప్రాయం.

By:  Tupaki Desk   |   15 Aug 2023 12:30 PM GMT
యానిమల్‌ పెద్ద ప్రమాదం తప్పించుకుందా?
X

అర్జున్‌ రెడ్డి మేకర్‌ సందీప్ వంగ దర్శకత్వంలో ప్రస్తుతం రూపొందుతున్న చిత్రం 'యానిమల్‌'. రణబీర్ కపూర్‌ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను ఆగస్టు లో విడుదల చేయాలని మొదట భావించారు. గత రెండేళ్లుగా ఈ సినిమా గురించి ఆసక్తికర ప్రచారం జరుగుతోంది. ఈ సినిమా ఆగస్టులో విడుదల అవ్వక పోవడం పట్ల కొందరు అసంతృప్తి వ్యక్తం చేశారు.

తాజాగా వారు కూడా ఇప్పుడు యానిమల్ సినిమాను ఆగస్టులో విడుదల చేయకపోవడం మంచిది అయిందని కామెంట్స్ చేస్తున్నారు. ఆగస్టు నెలలో సౌత్ తో పాటు బాలీవుడ్‌ లో కూడా భారీ చిత్రాలు విడుదల అయ్యాయి. దాంతో యానిమల్ కు గట్టి పోటీ ఉండేది అనేది కొందరి అభిప్రాయం.

మొదట అనుకున్న ప్రకారం గదర్ 2 తో పాటు ఆగస్టు లో యానిమల్ సినిమా రావాల్సి ఉంది. కానీ పోటీ వద్దనుకున్నారో లేదంటే సినిమా మేకింగ్‌ పూర్తి అవ్వలేదని వాయిదా వేశారో కానీ తాజాగా డిసెంబర్‌ కి సినిమాను వాయిదా వేయడం జరిగింది.

ఈ ఆగస్టు లోనే ఓమై గాడ్ 2 సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెల్సిందే. గదర్ 2 మరియు ఓ మై గాడ్ 2 సినిమాలు కూడా మంచి విజయాలను సొంతం చేసుకోవడంతో పాటు భారీ వసూళ్లు నమోదు చేసిన నేపథ్యంలో కచ్చితంగా యానిమల్‌ సినిమా కి నష్టం జరిగి ఉండేదేమో.

ఆగస్టు లోనే జైలర్ సినిమా కూడా విడుదల అయింది. ఆ సినిమా వల్ల సౌత్‌ లో యానిమల్ కి ఆశించిన స్థాయిలో బిజినెస్ అయ్యేది కాదు. కనుక యానిమల్ సినిమా ఆగస్టు లో రాకపోవడం అనేది పెద్ద ప్రమాదం నుండి తప్పించుకున్నట్లు అంటూ బాలీవుడ్ బాక్సాఫీస్ వర్గాల వారు అంటున్నారు. డిసెంబర్‌ లో సేఫ్‌ జోన్ లో ఈ సినిమా రాబోతుంది.