Begin typing your search above and press return to search.

తెలుగు 'యానిమల్‌' ఇంకాస్త పెంచాల్సిందే!

హిందీ లో రణబీర్‌ కపూర్ స్టార్‌ హీరో కనుక యానిమల్ సినిమాకు సహజంగానే అక్కడ భారీ క్రేజ్‌ ఉంది. దానికి తోడు మరింతగా క్రేజ్‌ పెంచే విధంగా ప్రమోషన్స్‌ ను చేశారు

By:  Tupaki Desk   |   19 Nov 2023 4:09 AM GMT
తెలుగు యానిమల్‌ ఇంకాస్త పెంచాల్సిందే!
X

తెలుగు దర్శకుడు సందీప్‌ వంగ హిందీలో రూపొందించిన చిత్రం 'యానిమల్‌'. రణబీర్‌ కపూర్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్‌ గా రూపొందిన యానిమల్‌ సినిమాను హిందీ తో పాటు సమానంగా తెలుగు లో కూడా విడుదల చేయాలని యూనిట్‌ సభ్యులు భావిస్తున్నారు. కానీ ఆ దిశగా ప్రమోషన్‌ చేయడం లేదు అనిపిస్తోంది.

యానిమల్ సినిమా కు తెలుగు లో ఇప్పటి వరకు పెద్దగా బజ్‌ క్రియేట్‌ అవ్వలేదు. తాజాగా ఆహా ఓటీటీ ద్వారా బాలయ్య అన్‌ స్టాపబుల్‌ షో లో యానిమల్‌ టీమ్‌ సందడి చేశారు. కానీ అంతకు మించిన ప్రమోషన్స్‌ ఇప్పటి వరకు చేస్తున్న దాఖలాలు లేవు. అందుకే ఇక్కడ ప్రమోషన్ విషయంలో బయ్యర్లు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఉంటారు.

హిందీ లో రణబీర్‌ కపూర్ స్టార్‌ హీరో కనుక యానిమల్ సినిమాకు సహజంగానే అక్కడ భారీ క్రేజ్‌ ఉంది. దానికి తోడు మరింతగా క్రేజ్‌ పెంచే విధంగా ప్రమోషన్స్‌ ను చేశారు. కానీ యానిమల్‌ సినిమాను తెలుగు లో భారీ ఎత్తున ప్రమోషన్‌ చేసినా కూడా జనాల్లోకి తీసుకు వెళ్లడం కాస్త కష్టమే. అలాంటిది అడపా దడపా ప్రచారంతో ఎంత వరకు వర్కౌట్ అయ్యేను అంటున్నారు.

యానిమల్‌ సినిమాలో హీరోయిన్‌ రష్మిక మందన్న మరియు దర్శకుడు సందీప్‌ వంగ అవ్వడం వల్ల తెలుగు లో సినిమాకు విభిన్నంగా ప్రమోషన్స్‌ చేస్తే కచ్చింగా బజ్‌ క్రియేట్‌ చేయవచ్చు. కానీ అన్‌ స్టాపబుల్‌ షో మినహా ఇక్కడ పెద్దగా ప్రచారం చేయలేదు. విడుదలకు మరో వారం మాత్రమే సమయం ఉంది. మరి ఈ లోపు ఏమైనా చేసేనా అనేది చూడాలి.

అర్జున్‌ రెడ్డి సినిమా తో దర్శకుడు సందీప్‌ వంగ ఆహా అనిపించాడు. అక్కడ అదే అర్జున్‌ రెడ్డి ని కబీర్‌ సింగ్‌ గా రూపొందించి కమర్షియల్‌ గా భారీ విజయాన్ని సొంతం చేసుకోవడం జరిగింది. కనుక యానిమల్‌ సినిమా విషయంలో అంచనాలు అక్కడ భారీగా ఉన్నాయి. ఇక్కడ మాత్రం ఆ స్థాయి బజ్‌ క్రియేట్‌ చేయడం లో విఫలం అయ్యారు అనిపిస్తోందని మీడియా సర్కిల్స్ వారు మాట్లాడుకుంటున్నారు.