Begin typing your search above and press return to search.

వీడియో : బిగ్ బాస్ దివి 'జమాల్‌' డాన్స్‌

రణబీర్ కపూర్‌, సందీప్ వంగ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్‌ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే

By:  Tupaki Desk   |   23 Dec 2023 8:33 AM GMT
వీడియో : బిగ్ బాస్ దివి జమాల్‌ డాన్స్‌
X

రణబీర్ కపూర్‌, సందీప్ వంగ కాంబినేషన్ లో వచ్చిన యానిమల్‌ సినిమా సూపర్ డూపర్ హిట్ గా నిలిచిన విషయం తెల్సిందే. వెయ్యి కోట్ల వసూళ్లకు కాస్త దూరంలో ఉన్న యానిమల్‌ లోని జమాల్‌ సాంగ్ సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో వైరల్‌ అవుతుందో తెల్సిందే. చిన్నా పెద్దా అనే తేడా లేకుండా యానిమల్‌ జమాల్ పాటకు డాన్స్ చేసి షార్ట్‌ వీడియోగా షేర్‌ చేస్తున్నారు.

సినిమాలో విలన్ బాబీ డియోల్‌ ఎంట్రీకి సంబంధించిన ఈ పాట పెద్ద స్థాయిలో ట్రెండ్‌ అవుతోంది. ఒక విలన్ ఎంట్రీ పాట ఈ స్థాయిలో ట్రెండ్‌ అవ్వడం ఈ మధ్య కాలంలో ఇదే అన్నట్లుగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది కూడా జమాల్ సాంగ్ కి డాన్స్ చేస్తూ సందడి చేశారు.

తాజాగా తెలుగు బిగ్‌ బాస్ బ్యూటీ దివి కూడా తన వర్షన్ లో జమాల్‌ డాన్స్ చేసింది. గ్లాస్ ను తల మీద పెట్టుకుని బాబీ డియోల్‌ ఒరిజినల్‌ వర్షన్ లో డాన్స్ చేయడం జరిగింది. దివి కూడా గాజు గ్లాస్ చేతిలో పట్టుకుని తాగుతూ ఉన్నట్లుగా యాక్టింగ్‌ చేస్తూ స్టెప్స్ వేసింది. తలపై గ్లాస్ పెట్టుకుని డాన్స్ చేసేందుకు ప్రయత్నించింది.

మొత్తానికి ట్రెండ్‌ అవుతున్న జమాల్‌ పాటకు దివి డాన్స్ చేయడం, అది కూడా అందమైన బ్లాక్ చీర కట్టుకుని చేయడం అనేది ప్రత్యేకమైన విషయం. దివి జమాల్ సాంగ్‌ కు చీర కట్టుకుని డాన్స్ చేయడంతో పాట పాపులారిటీ మరింత పెరిగిందని ఆమె అభిమానులు కామెంట్ చేస్తున్నారు.

షూటింగ్‌ మధ్య లో జమాల్‌ పాటకు తాను డాన్స్ ట్రై చేశాను అంటూ చెప్పుకొచ్చింది. చీర కట్టులో దివి సూపర్‌ గా ఉంటుంది. అది కాకుండా బ్లాక్ చీర కట్టుకుని జమాల్ పాటకు డాన్స్ చేయడంతో అంతా కూడా ఫిదా అవుతున్నారు. ఇప్పటి వరకు వచ్చిన జమాల్‌ డాన్స్ రీల్స్ లో ఇదే బెస్ట్‌ అంటూ ఫ్యాన్స్ నుంచి కామెంట్స్ వస్తున్నాయి.