Begin typing your search above and press return to search.

యానిమల్ మూవీ.. రాధిక అంత మాట అనేసిందేంటి?

అర్జున్ రెడ్డి మూవీతో సెన్సేషనల్ హిట్ సాధించిన సందీప్ రెడ్డి.. లేటెస్ట్‌ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు.

By:  Tupaki Desk   |   27 Jan 2024 7:57 AM GMT
యానిమల్ మూవీ.. రాధిక అంత మాట అనేసిందేంటి?
X

అర్జున్ రెడ్డి మూవీతో సెన్సేషనల్ హిట్ సాధించిన సందీప్ రెడ్డి.. లేటెస్ట్‌ గా యానిమల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టేశారు. మూడున్నర గంటల సినిమాతో మరోసారి తన మార్క్ ఏంటో చూపించారు. దీంతో యానిమల్ మూవీపై విపరీతమైన క్రేజ్ పెరిగింది. సోషల్ మీడియాలో మోత మోగిపోయింది. యానిమల్ మూవీలోని బీజీఎమ్, సాంగ్స్, సీన్స్, స్క్రీన్ ప్లేపై ప్రశంసలు కురిపిస్తూ మీమ్స్, వీడియోలు తెగ ఆకట్టుకున్నాయి.

ఇటీవలే యానిమల్ మూవీలోని సౌండ్ ట్రాక్స్‌ ను మేకర్స్ విడుదల చేశారు. ఈ ఒరిజనల్ బీజీఎమ్ సౌండ్ ట్రాక్‌ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూశారు. వారు కోరుకున్నట్లుగానే సౌండ్ ట్రాక్స్ వచ్చేశాయి. ఇక ఈ మూవీ ఓటీటీ హక్కులను సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్.. సంక్రాంతి కానుకగా యానిమల్ ను స్ట్రీమింగ్ చేస్తుందని అంతా భావించారు. కానీ రిపబ్లిక్ డే కానుకగా స్ట్రీమింగ్ స్టార్ట్ అయింది. రెండు రోజులుగా ట్విట్టర్ లో ఇదే విషయం ఫుల్ ట్రెండ్ అయింది.

ఇదిలా ఉంటే.. తాజాగా సీనియర్ నటి రాధిక ట్వీట్ వైరల్ గా మారింది. "ఎవరైనా ఆ సినిమా చూశాక అసహ్యం కలిగిందా ? నాకు ఆ మూవీపై వాంతి చేయాలని ఉంది. చాలా కోపంగా అనిపిస్తోంది" అని ట్వీట్ చేశారు. కానీ రాధిక సినిమా పేరు మాత్రం చెప్పలేదు. దీంతో కొందరు నెటిజన్లు.. రాధిక యానిమల్ మూవీపై ఇలా కామెంట్లు చేశారని అంటున్నారు. దీనిపై రాధిక మళ్లీ స్పందిస్తారేమో చూడాలి.

మరోవైపు, థియేటర్లలో విడుదలైన 3 గంటల 21 నిమిషాల రన్‌ టైమ్‌ తోనే నెట్‌ఫ్లిక్స్‌ లో యానిమల్‌ ను రిలీజ్ చేయడంతో అభిమానులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. డిలీటెడ్ సీన్లను ఓటీటీలో రిలీజ్ చేస్తామని చెప్పి చివరికి థియేటర్ వెర్షన్‌నే విడుదల చేశారని అంటున్నారు. ఇలా జవాన్, విరూపాక్షతో మరికొన్ని సినిమాలకు కూడా జరిగింది.

బాక్సాఫీస్ వద్ద బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్, నేషనల్ క్రష్ రష్మిక నటించిన యానిమల్ మూవీ వరల్డ్ వైడ్‌గా రూ. 915 కోట్లకుపైగా కలెక్షన్స్ వసూలు చేసింది. దీంతో 2023 సంవత్సరంలోనే అతిపెద్ద బ్లాక్ బస్టర్ చిత్రంగా యానిమల్ నిలిచింది. అనేక రికార్డులను బ్రేక్ చేసింది.