Begin typing your search above and press return to search.

నెం.2... 'యానిమల్‌'కి అరుదైన రికార్డ్‌

ప్రపంచ వ్యాప్తంగా యానిమల్‌ సినిమా దాదాపుగా రూ.900 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది.

By:  Tupaki Desk   |   1 Jan 2024 10:53 AM GMT
నెం.2... యానిమల్‌కి అరుదైన రికార్డ్‌
X

రణబీర్‌ కపూర్‌ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్‌ సినిమా విడుదల అయ్యి నెల రోజులు దాటినా కూడా వసూళ్ల విషయంలో దూకుడు కొనసాగుతూనే ఉంది. వీకెండ్స్ లో యానిమల్‌ సినిమాకు వస్తున్న వసూళ్లు బాక్సాఫీస్‌ వర్గాల వారిని కూడా షాక్‌ కి గురి చేస్తున్నాయి.

యానిమల్ సినిమా సాధిస్తున్న వసూళ్ల తో పలు రికార్డులు బ్రేక్ అవుతున్నాయి. వెయ్యి కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తుందని విడుదల సమయంలో మేకర్స్‌ తో పాటు మీడియా వర్గాల వారు చాలా నమ్మకం వ్యక్తం చేశారు. కానీ యానిమల్‌ సినిమా వెయ్యి కోట్ల కి కాస్త దూరంలో నిలిచిన విషయం తెల్సిందే.

ప్రపంచ వ్యాప్తంగా యానిమల్‌ సినిమా దాదాపుగా రూ.900 కోట్లు వసూలు చేసినట్లు తెలుస్తోంది. ఇక ఇండియాలో యానిమల్‌ సినిమా ఏకంగా రూ.543 కోట్ల వసూళ్లను దక్కించుకుంది. కేవలం ఇండియాలో ఈ రేంజ్ వసూళ్లు సాధించడంతో అరుదైన ఘనత ను యానిమల్‌ సినిమా దక్కించుకుంది.

ఇప్పటి వరకు ఇండియాలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమా గా జవాన్ ఉంది, ఆ తర్వాత స్థానంలో పఠాన్‌ ఉంది. తాజాగా 543 కోట్లు సాధించడంతో పఠాన్ ఫుల్ రన్‌ కలెక్షన్స్ ను యానిమల్‌ బ్రేక్ చేసినట్లు అయింది. నెం.2 గా ఉన్న పఠాన్‌ ను నెం.3 కి నెట్టి నెం.2 కి యానిమల్ సినిమా చేరింది.

ఓవర్సీస్‌ లో కూడా భారీగా వసూళ్లు సాధించినా కూడా ఇండియా కలెక్షన్స్ విషయంలో మాత్రం నెం.2 స్థానంను ఈ సినిమా దక్కించుకుంది. సలార్ తో పాటు మరి కొన్ని సినిమాలు వచ్చినా కూడా యానిమల్‌ సినిమాకు ఒక మోస్తరుగా వసూళ్లు నమోదు అవుతూనే ఉన్నాయి. కనుక మరిన్ని రికార్డులు యానిమల్ కి దక్కే అవకాశాలు ఉన్నాయి.