Begin typing your search above and press return to search.

యానిమల్‌ : థియేటర్ల వద్ద గందరగోళం తప్పదా?

వసూళ్ల విషయం పక్కన పెడితే థియేటర్ల వద్ద యానిమల్ సినిమా రన్ టైమ్‌ గందరగోళ పరిస్థితులను క్రియేట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

By:  Tupaki Desk   |   26 Nov 2023 6:35 AM GMT
యానిమల్‌ : థియేటర్ల వద్ద గందరగోళం తప్పదా?
X

రణబీర్‌ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా సందీప్ వంగ దర్శకత్వంలో రూపొందిన యానిమల్ సినిమా డిసెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. హిందీ భాషలో రూపొందిన ఈ సినిమాను తెలుగు రాష్ట్రాల్లో కూడా భారీ ఎత్తున విడుదల చేసేందుకు గాను ఏర్పాట్లు దాదాపుగా పూర్తి అయ్యాయి.

ఒక డైరెక్ట్‌ తెలుగు సినిమా మాదిరిగానే యానిమల్‌ ను ప్రేక్షకులు చూస్తున్నారు. సందీప్ వంగ తెలుగు దర్శకుడు అవ్వడంతో పాటు రష్మిక మందన్న టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్ అవ్వడం వల్ల యానిమల్‌ సినిమాకి టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద సాలిడ్ ఓపెనింగ్స్ దక్కే అవకాశాలు ఉన్నాయి అంటూ బాక్సాఫీస్ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

వసూళ్ల విషయం పక్కన పెడితే థియేటర్ల వద్ద యానిమల్ సినిమా రన్ టైమ్‌ గందరగోళ పరిస్థితులను క్రియేట్‌ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి అంటూ సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ మధ్య కాలంలో టాలీవుడ్‌ ప్రేక్షకులు రెండున్నర, పావు తక్కువ మూడు గంటల సినిమాలకు ఎక్కువగా అలవాటు పడ్డారు.

రాజమౌళి, సుకుమార్ వంటి వారు మాత్రమే మూడు గంటల సినిమాలను తీసుకు వస్తున్నారు. ఇతరులు మూడు గంటల సినిమాలు తీసుకు వచ్చినా కూడా నిరాశే మిగిలింది అనేది సినీ విశ్లేషకుల అభిప్రాయం. అలాంటిది యానిమల్ సినిమా ఏకంగా 3 గంటల 21 నిమిషాలతో రాబోతుంది.

ఇప్పటికే సెన్సార్‌ కూడా పూర్తి చేసుకున్న ఈ సినిమా రన్ టైమ్‌ ఫైనల్ అయింది. 3 గంటల 21 నిమిషాల నిడివి తో సినిమాను ప్రదర్శించాలి అంటే థియేటర్ల యజమానులకు పెద్ద సమస్యగా మారింది. ముఖ్యంగా సింగిల్ స్క్రీన్‌ థియేటర్ల ప్రేక్షకులు ఒక టైమ్‌ కి ఫిక్స్ అయ్యి ఉంటారు. కానీ యానిమల్‌ సినిమాను ఉదయం గంట ముందే షో లు ప్రదర్శణ మొదలు పెట్టాల్సి ఉంటుంది.

షో కి షో కి మధ్య కూడా సమయం తగ్గించాల్సి ఉంటుంది. ఇన్ని చేయడం వల్ల రెగ్యులర్ టైమ్‌ కు థియేటర్ల వద్దకు వచ్చే ప్రేక్షకులు గందరగోళంకు గురి అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

సినిమా టైమింగ్స్ ను కచ్చితంగా క్లారిటీతో సింగిల్‌ స్క్రీన్ థియేటర్లు ప్రేక్షకులకు అర్థం అయ్యేలా ప్రదర్శించాల్సి ఉంటుంది. అలా కాకుంటే మాత్రం సినిమా చూడ్డానికి వచ్చిన ప్రేక్షకులు సినిమా మధ్యలో ఉన్న సమయంలో థియేటర్లకు చేరుకునే అవకాశాలు లేకపోలేదు అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ గందరగోళం ను యానిమల్ థియేటర్ల యాజమాన్యాలు ఎలా కవర్‌ చేస్తాయో చూడాలి.