Begin typing your search above and press return to search.

అడల్ట్ బాక్సాఫీస్ రికార్డులు.. యానిమాల్ బ్రేక్ చేసేనా?

సెన్సార్ లో ఏ సర్టిఫికేట్ సినిమాలు అంటే కచ్చితంగా అది పిల్లలు చూడకూడని సినిమా అని. మితిమీరిన హింస, శృతిమించిన శృంగార సన్నివేశాలు

By:  Tupaki Desk   |   23 Nov 2023 4:46 AM GMT
అడల్ట్ బాక్సాఫీస్ రికార్డులు.. యానిమాల్ బ్రేక్ చేసేనా?
X

సెన్సార్ లో ఏ సర్టిఫికేట్ సినిమాలు అంటే కచ్చితంగా అది పిల్లలు చూడకూడని సినిమా అని. మితిమీరిన హింస, శృతిమించిన శృంగార సన్నివేశాలు. ఏదైనా ఒక మతం, ప్రాంతం భావజాలం సెన్సిటివ్ గా ఉన్నా, లేదంటే రియల్ లైఫ్ లో జరిగిన ఘోరాలు చూపించే హింసాత్మక చిత్రాలకి సెన్సార్ ఏ సర్టిఫికేట్ ఇస్తూ ఉంటుంది. సౌత్ లో ఇలా ఏ సర్టిఫికేట్ వచ్చే సినిమాలు చాలా తక్కువ ఉంటాయి. మెజారిటీ చిత్రాలు U/A సర్టిఫికేట్ పొందుతాయి.

నార్త్ లో A సర్టిఫికేట్ సినిమాలు రెగ్యులర్ గా వస్తూ ఉంటాయి. అలా వచ్చిన వాటిలో అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాలు చూసుకుంటే అందులో మొదటి స్థానంలో అర్జున్ రెడ్డి రీమేక్ అయిన కబీర్ సింగ్ ఉంది. ఈ సినిమా ఏకంగా 380 కోట్లు కలెక్ట్ చేసింది. వివేక్ అగ్నిహోత్రి దర్శకత్వంలో వచ్చిన ది కాశ్మీర్ ఫైల్స్ 340 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. రీసెంట్ గా వచ్చిన ది కేరళ స్టొరీ మూవీ 300 కోట్లు కొల్లగొట్టింది.

అక్షయ్ కుమార్ శివుడి పాత్రలో చేసిన OMG 2 మూవీ 225 కోట్ల కలెక్షన్స్ అందుకుంది. ఈ సినిమాల బడ్జెట్ పరంగా చూసుకుంటే ఇవి భారీ కలెక్షన్స్ అని చెప్పొచ్చు. ఇప్పుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా యానిమల్ మూవీ రిలీజ్ కాబోతోంది. ఇది కూడా ఏ సర్టిఫైడ్ మూవీనే. దీని మీద భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఏ మాత్రం పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న వెయ్యి కోట్ల వరకు కలెక్షన్స్ అందుకునే అవకాశం కనిపిస్తోంది.

అదే జరిగితే హైయెస్ట్ గ్రాస్ కలెక్ట్ చేసిన ఏ సర్టిఫైడ్ మూవీస్ లో యానిమల్ టాప్ లో ఉంటుంది. మరి దానిని సందీప్ రెడ్డి, రణబీర్ ద్వయం అందుకుంటారా అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా ఈ మూవీ ఐదు భాషలలో రిలీజ్ అవుతోంది. హిందీ తర్వాత తెలుగులో కూడా యానిమల్ సినిమాపైన మంచి హైప్ ఉంది. దీనికి కారణం హీరోయిన్ రష్మిక మందనతో పాటు అర్జున్ రెడ్డి తర్వాత సందీప్ రెడ్డి నుంచి వస్తోన్న సినిమా కావడమే.

బాలీవుడ్ సినిమాలలో తెలుగు నాట హైయెస్ట్ కలెక్షన్స్ అందుకున్న సినిమాగా పఠాన్ ఉంది. దానిని బ్రేక్ చేసే చేసే అవకాశం ఇప్పుడు యానిమల్ కి వచ్చింది. రణబీర్ కపూర్ బ్రహ్మాస్త్ర మూవీ కూడా తెలుగులో మంచి వసూళ్లు సాధించింది. ఇప్పుడు యానిమల్ తో రికార్డ్ క్రియేట్ చేయాలని రణబీర్ కపూర్ ప్లాన్ చేసుకుంటున్నారు.