Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: సిగరెట్ తాగేవాడు యానిమ‌ల్?

ఆ త‌ర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. ఇంత‌కుముందే ప్రొడక్షన్ హౌస్ T-సిరీస్ యానిమల్ కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించింది

By:  Tupaki Desk   |   18 Sep 2023 6:57 AM GMT
ఫోటో స్టోరి: సిగరెట్ తాగేవాడు యానిమ‌ల్?
X

సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన 'యానిమల్' డిసెంబర్ 1 న థియేట‌ర్ల‌లో విడుదల కానుంది. విక్కీ కౌశల్ - సామ్ బహదూర్‌తో బాక్సాఫీస్ వద్ద ఢీకొంటుంది. ఇంత‌లోనే కొత్త పోస్ట‌ర్ తో అభిమానుల్లో ఉత్కంఠ పెంచింది టీమ్. వివ‌రాల్లోకి వెళితే..


రణ్‌బీర్ కపూర్ గ్యాంగ్‌స్టర్ డ్రామా 'యానిమల్' 2023లో మోస్ట్ అవైటెడ్ చిత్రాలలో ఒకటి. ఈ సంవత్సరం జనవరి 1న విడుదలైన ఈ చిత్రం ఫస్ట్ లుక్ ఆశ్చ‌ర్య‌ప‌రిచింది. మునుపెన్నడూ చూడని క‌ఠిన‌మైన‌ అవతార్‌లో ర‌న‌బీర్ ని సందీప్ వంగా ఆవిష్క‌రించారు. రణబీర్ గొడ్డలి చేత‌ప‌ట్టి క్రూరుడిగా క‌నిపించే ప్రీ-టీజర్ చాలా చ‌ర్చ‌కు తావిచ్చింది.

ఆ త‌ర్వాత ఈ సినిమాకి సంబంధించిన ఎలాంటి అధికారిక అప్ డేట్ లేదు. ఇంత‌కుముందే ప్రొడక్షన్ హౌస్ T-సిరీస్ యానిమల్ కొత్త పోస్టర్‌ను ఆవిష్కరించింది. పోస్ట‌ర్ లో కపూర్ సిగరెట్ తాగుతూ ర‌ఫ్ గా క‌నిపిస్తున్నాడు. 41వ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టీజర్ ని సెప్టెంబర్ 28న విడుద‌ల చేస్తామ‌ని కూడా ప్రకటించారు. ''అతను సొగసైనవాడు.. అతను వైల్డ్.. సెప్టెంబర్ 28న అతని ఆవేశాన్ని మీరు చూస్తారు'' అని పోస్టర్ పై క్యాప్షన్ వేసారు. తాజాగా రణబీర్ కొత్త లుక్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది, చాలా మంది అభిమానులు సందీప్ రెడ్డి వంగా చిత్రంలో తన రా అండ్ ఇంటెన్స్ లుక్‌లో తమ ప్రియమైన సూపర్ స్టార్‌ను చూడటం కొత్త‌గా ఉంద‌ని వ్యాఖ్యానిస్తున్నారు.

యానిమల్‌లో బాబీ డియోల్, అనిల్ కపూర్, ట్రిప్తి డిమ్రీ, రష్మిక మందన్న కీల‌క‌ పాత్రలు పోషిస్తున్నారు. ఇంతకు ముందు పరిణీతి చోప్రా క‌థానాయిక‌గా ఎంపికైనా ఆ త‌ర్వాత ర‌ష్మిక‌తో రీప్లేస్ చేసారు. ప‌రిణీతి .. ఇంతియాజ్ అలీ - దిల్జిత్ దోసాంజ్ చమ్కిలాకు సంత‌కం చేసింది. దివంగత పంజాబీ గాయకుడి బయోపిక్ నెట్‌ఫ్లిక్స్‌లో 2024లో విడుదల కానుంది.

'యానిమల్' ఇంతకు ముందు సన్నీ డియోల్ దేశభక్తి డ్రామా గదర్ 2 .. అక్షయ్ కుమార్ వ్యంగ్య కామెడీ OMG 2 తో పోటీపడుతూ ఆగష్టు 11 న విడుదల చేయవలసి ఉంది. కానీ పోస్ట్ ప్రొడక్షన్ ఆలస్యం కారణంగా వాయిదా పడింది. రెండు సీక్వెల్స్‌తో ఘర్షణ ముగిసినా డిసెంబ‌ర్ లో విక్కీ కౌశల్ - సామ్ బహదూర్ తో పోటీప‌డుతుంద‌ని తెలుస్తోంది. డిసెంబర్ 1 న ఈ రెండు సినిమాలు విడుద‌ల‌య్యే అవ‌కాశం ఉంది.