Begin typing your search above and press return to search.

యానిమల్.. అవేంజర్స్ రేంజ్ వరకు

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరపైకి వచ్చిన యానిమల్ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 1:30 PM GMT
యానిమల్.. అవేంజర్స్ రేంజ్ వరకు
X

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో రణబీర్ కపూర్ హీరోగా తెరపైకి వచ్చిన యానిమల్ సినిమా ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ఈ సినిమాలో ప్రతి విషయం కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ప్రపంచంలో చాలా హాట్ టాపిక్ గా మారుతుంది. సినిమాలో నటించిన ప్రతి ఒక్క క్యారెక్టర్ గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు.


ఇక ఇందులో వైలెన్స్ రొమాంటిక్ సన్నివేశాలు ఎక్కువయ్యాయి అని చాలా విమర్శలు వస్తున్నప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద అసలు ఏమాత్రం కలెక్షన్స్ అయితే తగ్గడం లేదు. ఇప్పటికే 400 కోట్లకు పైగా కలెక్షన్స్ సొంతం చేసుకున్న యానిమల్ సినిమా 1000 కోట్లను కూడా అందుకుంటుంది అని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.

అయితే ఈ సినిమాలోని మ్యూజిక్ కూడా స్పెషల్ అట్రాక్షన్ గా నిలిచింది. ఇక పాటల కంటే ఎక్కువగా బ్యాగ్రౌండ్ మ్యూజిక్ బాగా వైరల్ అయింది. ఇక సందీప్ రెడ్డి వంగ మ్యూజిక్ టేస్ట్ గురించి కూడా అందరూ చర్చించుకుంటున్నారు. అయితే ఎందులో విలన్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఒక అరబ్ సాంగ్ బాగా హైలైట్ అయింది. జమల్ జమాలో అనే ఆ పాట లో సన్నీ డియోల్ ఎంట్రీ ఇచ్చిన విధానం మంచి వైబ్ క్రియేట్ చేస్తోంది.

అయితే ఇది ఏకంగా సోషల్ మీడియా ద్వారా మార్వెల్ అవేంజర్స్ ను టచ్ చేయడం విశేషం. మార్వెల్ ఇండియా ఇన్స్టాగ్రామ్ లో ఇటీవల ఈ పాటతో ఒక రిల్ రిలీజ్ చేశారు. అందులో మార్వెల్ అవేంజర్స్ హీరోలు అందరూ కూడా కలిసి డాన్స్ చేస్తున్నట్లుగా పాటను జత చేయడంతో బాగా వైరల్ అయింది. అంతేకాకుండా అర్థం తెలియకపోయినా చాలా వైఫ్ ను క్రియేట్ చేస్తోంది అని మంచి క్యాప్షన్ కూడా ఇచ్చారు.

దీంతో అది కాస్త సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతుంది. ఇక యానిమల్ సినిమాకు సీక్వెల్ కూడా ఉంటుంది అని దర్శకుడు సందీప్ సినిమా ఎండింగ్ లోనే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. యానిమల్ పార్క్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేసుకున్నారు. మరి ఆ సినిమాను వెండితెరపైకి ఎప్పుడు తీసుకు వస్తారో.