Begin typing your search above and press return to search.

యానిమల్ 'చిన్ని చిన్ని ఆశ'.. అతడి వల్లే అలా..

బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 9:56 AM GMT
యానిమల్ చిన్ని చిన్ని ఆశ.. అతడి వల్లే అలా..
X

బాక్స్ ఆఫీస్ వద్ద యానిమల్ సినిమా ఏ స్థాయిలో సక్సెస్ అవుతుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. బాలీవుడ్ లోనే కాకుండా ఇటు టాలీవుడ్ లోనూ ఈ సినిమా ఇప్పటికే పెట్టిన పెట్టుబడిన వెనక్కి తెచ్చి బయ్యర్లకు డిస్ట్రిబ్యూటర్లకు మంచి లాభాలను అందిస్తోంది. మిగతా భాషల్లో కూడా డీసెంట్ గా కలెక్షన్స్ అయితే సొంతం చేసుకుంటున్న అనిమల్ సినిమా ఈజీగా 500 కోట్ల మార్క్ ను తొందరగానే అందుకోబోతున్నట్లుగా తెలుస్తోంది.

ఇక ఇదే తరహాలో ముందుకు వెళితే సినిమా ఈజీగా వెయ్యి కోట్ల మార్క్ ను కూడా అందుకోగలదు అని ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. ఇక యానిమల్ సినిమాకు సంబంధించిన చాలా రకాల విషయాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి సినిమాలో సెట్స్ నుంచి ఆర్ట్ వర్క్ వరకు అలాగే క్యాస్టింగ్ గురించి కూడా అన్ని విషయాల గురించి నెటిజన్లు మాట్లాడుకుంటూ ఉన్నారు.

ఇక ఈ సినిమాలో ముఖ్యంగా సందీప్ రెడ్డివంగా బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సెలెక్ట్ చేసుకున్న విధానం కూడా హైలెట్ అవుతోంది. అయితే కొన్ని సన్నివేశాల్లో ఇతర సినిమాల్లోని సాంగ్స్ కూడా ఉపయోగించాడు. అలాగే ఒక అరబ్ సాంగ్ కూడా అందులో ఉన్న విషయం తెలిసిందే. ఇక రణబీర్ కపూర్ సినిమాలో యంగ్ క్యారెక్టర్ గా ఉన్నప్పుడు ఎంట్రీ ఇచ్చిన విధానం చాలా హైలెట్ అయింది.

అయితే అందులో చిన్ని చిన్ని ఆశ అనే బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ లో చాలా హైలెట్గా నిలిచింది. ఇక రణబీర్ కపూర్ అందులో వేసిన స్టెప్పులు కూడా ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అయితే ఆ స్టెప్పులను అంత స్టైలిష్ గా కంపోజ్ చేసింది మరెవరో కాదు మన టాలీవుడ్ ఆట సందీప్. బిగ్ బాస్ కంటెస్టెంట్ గా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్న సందీప్ ఆ విషయాన్ని ఇటీవల తెలియజేశారు.

సందీప్ రెడ్డివంగా గారి నుంచి అలాంటి ఆఫర్ రావడం చాలా ఆనందాన్ని ఇచ్చింది అని రణబీర్ కపూర్ తో వర్క్ చేయడం కూడా ఎంతో సంతోషంగా అనిపించి అని అతను తెలియజేశాడు. ఇక ప్రస్తుతం ఈ విషయం కూడా సోషల్ ఇండియా వైరల్ గా మారింది. ఆట సందీప్ మంచి టాలెంటెడ్ డ్యాన్స్ కంపోజర్ అని తనకి మరిన్ని అవకాశాలు రావాలి అని నెటిజన్లు కోరుకుంటున్నారు.