Begin typing your search above and press return to search.

యానిమల్.. సెలబ్రెటీలు బయపడుతుంటే..

కొన్ని సెన్సిటివ్ అంశాలు ఎక్కువగా ఉండటంతో మళ్ళీ ఇలాంటి రియాక్షన్స్ వస్తాయో అని అనుకుంటున్నారో ఏమో కానీ స్టార్స్ చాలా వరకు మౌనంగానే ఉంటున్నారు.

By:  Tupaki Desk   |   6 Dec 2023 1:17 PM GMT
యానిమల్.. సెలబ్రెటీలు బయపడుతుంటే..
X

రణబీర్ కపూర్ రష్మిక మందన్న జంటగా నటించిన యనిమల్ సినిమా బాక్సాఫీస్ వద్ద సాలీడ్ కలెక్షన్స్ అందుకుంటున్న విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా గురించి మాట్లాడడానికి సినిమా ఇండస్ట్రీలో అగ్ర తారాలు ఎవరు కూడా రిస్క్ చేయడం లేదు. కొన్ని సెన్సిటివ్ అంశాలు ఎక్కువగా ఉండటంతో మళ్ళీ ఇలాంటి రియాక్షన్స్ వస్తాయో అని అనుకుంటున్నారో ఏమో కానీ స్టార్స్ చాలా వరకు మౌనంగానే ఉంటున్నారు. త్రిష అయితే ట్వీట్ చేసిన కొద్దిసేపటికి మళ్ళీ డిలీట్ చేసింది.

ఇక యానిమల్ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ లో సందీప్ రెడ్డి పై ఒక రేంజ్ లో ప్రశంసలు కురిపించిన రాజమౌళి మహేష్ బాబు కూడా ఇంతవరకు సోషల్ మీడియాలో ఎలాంటి కామెంట్ కూడా చేయలేదు. ఇక కేవలం కొంతమంది సెలబ్రెటీలు మాత్రమే ఈ సినిమా గురించి స్పందిస్తూ ఉన్నారు. ఇక రేణు దేశాయ్ కూడా తనదైన శైలిలో సినిమా చూసిన తర్వాత ఒక వివరణ ఇచ్చారు.

మొత్తానికి సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమా చూడడం జరిగింది. ఈ సినిమా చూసిన తర్వాత ఎంతో లవ్లీ గా ఫీల్ అయ్యాను. ఆ సినిమాపై ప్రేమలో కూడా పడిపోయాను. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు బాగున్నాయి. మీకు ఏదైనా కొత్తగా అనుభూతి పొందాలని అనుకుంటే తప్పకుండా ఈ సినిమా చూడండి అంటూ రేణు దేశాయ్ తనదైన శైలిలో సినిమాపై ఒక వివరణ అయితే ఇచ్చారు.

ఇక ఆమె రియాక్ట్ అయిన విధానంపై నిటిజన్లు కూడా పాజిటివ్ గా రియాక్ట్ అవుతున్నారు. చాలామంది సెలబ్రిటీలు యానిమల్ సినిమా గురించి స్పందించడానికి ఆలోచిస్తున్న సమయంలో రేణు దేశాయ్ తన వివరణ ఇవ్వడం వైరల్ గా మారింది. ఇక దర్శకుడు సందీప్ రెడ్డివంగా ఈ సినిమాతోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో మరింత క్రేజ్ పెంచుకున్నాడు.

ఇక అతఙ నుంచి భవిష్యత్తులో రాబోయే సినిమాలు అంతకుమించి అనేలా ఉండబోతున్నాయి అని అర్థమవుతుంది. ఇక ప్రభాస్ తో స్పిరిట్ అనే సినిమా చేయబోతున్నట్లు గతంలోనే క్లారిటీ ఇచ్చాడు. ఆ సినిమా వచ్చే ఏడాది మొదలుకానుంది. అలాగే అల్లు అర్జున్ తో కూడా ఒక సినిమా చేయబోతున్నట్లు అధికారికంగా క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఆ సినిమా మాత్రం రావడానికి రెండేళ్ల సమయం పట్టవచ్చు. ఇక మహేష్ బాబుతో కూడా సందీప్ అయితే ఒక సినిమా చేయాలి అని ఆలోచనతో ఉన్నాడు.