Begin typing your search above and press return to search.

హాలీవుడ్ మూవీ నుంచి సందీప్ కాపీ కొట్టేశాడా?

'యానిమ‌ల్‌' కోసం మాత్రం 'అమ్మాయి' సాంగ్‌లోని లిప్ లాక్ స‌న్నివేశాల‌ని ఏకంగా పాపుల‌ర్ హాలీవుడ్ మూవీ 'ఫ‌ఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే'లోని హెలికాప్ట‌ర్ సీన్‌ల‌ని కాపీ చేశార‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి.

By:  Tupaki Desk   |   18 Oct 2023 11:30 PM GMT
హాలీవుడ్ మూవీ నుంచి సందీప్ కాపీ కొట్టేశాడా?
X

తెలుగులో 'అర్జున్ రెడ్డి' మూవీని సినిమాటిక్ బౌండ‌రీస్‌కు అవేగా తెర‌కెక్కించి మేక‌ర్స్‌ని ఆశ్చ‌ర్య‌ప‌రచ‌డ‌మే కాకుండా స్టార్స్‌ని కూడా డైల‌మాలో ప‌డేసిన ద‌ర్శ‌కుడు సందీప్ రెడ్డి వంగ. ఇదే మూవీని హిందీలో 'క‌బీర్ సింగ్‌' పేరుతో రీమేక్ చేసి అక్క‌డ కూడా ఇదే త‌ర‌హాలో సంచ‌ల‌నం సృష్టించాడు. ప్రస్తుతం క‌ణ్‌బీర్ క‌పూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగ రూపొందించిన గ్యాంగ్ స్ట‌ర్ యాక్ష‌న్ డ్రామా 'యానిమ‌ల్‌'. నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌న్న హీరోయిన్‌గా న‌టించిన ఈ మూవీని డిసెంబ‌ర్ 1న భారీ స్థాయిలో రిలీజ్ చేస్తున్నారు.

సినిమా రిలీజ్‌కు స‌మ‌యం ద‌గ్గ‌ర‌ప‌డుతున్న నేప‌థ్యంలో మేక‌ర్స్ ప్ర‌మోష‌న్స్‌ని ప్రారంభించారు. ఇప్ప‌టికే టీజ‌ర్‌తో సినిమా ఏ స్థాయిలో ఉండ‌నుంద‌న్న విష‌యాన్ని స్ప‌ష్టం చేసిన టీమ్ తాజాగా ఫ‌స్ట్ సింగిల్‌గా 'అమ్మాయి...' అంటూ సాగే రొమాంటిక్ సాంగ్‌ని విడుద‌ల చేసిన 'అర్జున్‌రెడ్డి'కి మించి ఇందులో రొమాంటిక్ స‌న్నివేశాలు ఉంటాయ‌ని స్ప‌ష్టం చేసింది. తాజ‌గా విడుద‌ల చేసిన లిరిక‌ల్ వీడియోలో ర‌ణ్ బీర్ క‌పూర్‌, ర‌ష్మిక మంద‌న్న మ‌ధ్య‌లో లిప్ లాక్ సీన్‌లు వ‌రుస‌గా ఉండ‌టంతో 'యానిమ‌ల్‌' అర్జున్ రెడ్డి'కి బాప్‌ల ఉంటంద‌నే కామెంట్‌లు మొద‌ల‌య్యాయి.

ఈ సినిమాకు ప్రీత‌మ్‌, విశాల్ మిశ్రా, హ‌ర్ష‌వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ వంటి త‌దిత‌ర తొమ్మిది మంది సంగీత ద‌ర్శ‌కులు ప‌ని చేశారు. పాట‌ల కోసం వీరు ప‌ని చేస్తే కేవ‌లం నేప‌థ్య సంగీతానికి 'అర్జున్ రెడ్డి' ఫేమ్ హ‌ర్ష వ‌ర్థ‌న్ రామేశ్వ‌ర్ ప‌ని చేశారు. అనిల్ క‌పూర్‌, బాబీ డియోల్, వెట‌క‌ర‌న్ యాక్ట‌ర్స్ శ‌క్తి క‌పూర్‌, సురేష్ ఓబెరాయ్‌ కీల‌క పాత్ర‌ల్లో న‌టించారు. డిసెంబ‌ర్ 1న హిందీతో పాటు ఐదు భాష‌ల్లో రిలీజ్ కానున్న ఈ సినిమాలోని ఓ సీన్ హాలీవుడ్ మూవీకి కాపీ అని ప్ర‌చారం జ‌రుగుతోంది.

'అర్జున్‌రెడ్డి' సినిమాలో కీల‌క బిజిఎమ్‌ల‌ని టాప్ హాలీవుడ్ మూవీస్ నుంచి లేపేసిన సందీప్ రెడ్డి వంగ 'యానిమ‌ల్‌' కోసం మాత్రం 'అమ్మాయి' సాంగ్‌లోని లిప్ లాక్ స‌న్నివేశాల‌ని ఏకంగా పాపుల‌ర్ హాలీవుడ్ మూవీ 'ఫ‌ఫ్టీ షేడ్స్ ఆఫ్ గ్రే'లోని హెలికాప్ట‌ర్ సీన్‌ల‌ని కాపీ చేశార‌నే కామెంట్‌లు వినిపిస్తున్నాయి. 2015లో విడుద‌లైన ఈ సినిమా వ‌ర‌ల్డ్ వైడ్‌గా బ్లాక్ బ‌స్ట‌ర్ అనిపించుకున్న విష‌యం తెలిసిందే.