Begin typing your search above and press return to search.

'యానిమ‌ల్‌'ని హిందూత్వ‌లోకి లాగారు!

ఇలాంటి సినిమాలో ట్రైలర్, టీజర్, పాటల్లో సినిమా ప్రచార కంటెంట్‌లో 'స్వస్తిక' చిహ్నాన్ని పునరావృతం చేయడంపై సినీ వర్గాలలో చ‌ర్చ సాగుతోంది.

By:  Tupaki Desk   |   26 Nov 2023 7:57 AM GMT
యానిమ‌ల్‌ని హిందూత్వ‌లోకి లాగారు!
X

ఒక్క యానిమ‌ల్ ట్రైల‌ర్ వంద ప్ర‌శ్న‌ల‌ను లేవ‌నెత్తింది. ఒక ట్రైల‌ర్ ని ఇంత ప్ర‌భావ‌వంతంగా ఎలా చూపించాలి? ఒక క‌థ‌ను ఎలా ఎంపిక చేసుకోవాలి? ఒక క‌థ‌లో పాత్ర‌ల్ని ఇంత ఇంటెన్సిటీతో ఎలా చూపించాలి? ఒక సన్నివేశాన్ని ఎలా ర‌క్తి కట్టించాలి? ఇలా ర‌క‌ర‌కాలుగా ప్ర‌శ్నించుకుంటున్నారు ఔత్సాహిక ఫిలింమేక‌ర్స్. 2023లో 1000 కోట్ల క్లబ్ సినిమాలు ఎన్ని వ‌చ్చినా వాటి గురించి కూడా ఇంత‌గా ముచ్చ‌టించుకోలేదంటే అతిశ‌యోక్తి కాదు. అంత‌గా సందీప్ వంగా-ర‌ణ‌బీర్ జోడీ నుంచి వ‌స్తున్న యానిమ‌ల్ ట్రైల‌ర్ ఆక‌ట్టుకుంది. ఒక తెలుగు వాడి ప‌నిత‌నాన్ని కీర్తించే స్థాయి ఇమేజ్ ఈ ట్రైల‌ర్ లో ఉంది.

అయితే యానిమల్ ట్రైల‌ర్ పై ఒక సెక్ష‌న్ వివాదాల‌ను మోసుకొచ్చింది. ప్రత్యేకించి మేల్ టాక్సిక్ (విష‌పూరిత‌) - హింస, అతిగా ప్రవర్తించడం వంటి అంశాల‌ చుట్టూ కేంద్రీకృతమైన క‌థ‌ను ఇప్పుడు కొంద‌రు ఎత్తి చూపుతున్నారు. అతిగా హింసాత్మ‌కంగా సినిమాని చూపించార‌ని విమ‌ర్శిస్తున్నారు. ఇలాంటి సినిమాలో ట్రైలర్, టీజర్, పాటల్లో సినిమా ప్రచార కంటెంట్‌లో 'స్వస్తిక' చిహ్నాన్ని పునరావృతం చేయడంపై సినీ వర్గాలలో చ‌ర్చ సాగుతోంది. అంతేకాదు.. దర్శకుడు సందీప్ రెడ్డి వంగాపై ఆరోపణలు తారాస్థాయికి చేరుకున్నాయి. అతను నిర్దిష్ట ప్రేక్షకులను రెచ్చగొట్టడానికి తీవ్రవాదం నాజీ తత్వాన్ని ప్రోత్సహిస్తున్నాడని కొందరు పేర్కొన్నారు. సందీప్ వంగా ఇలాంటి వాటిలో నిష్ణాతుడని కొందరు వాదిస్తున్నారు. అయితే అతడిని శాంతియుతంగా పని చేయనివ్వమని వ్యతిరేకులను కోరారు.

ఇలాంటి మ‌న‌స్త‌వ్వం ఉన్న ద‌ర్శ‌కుడు ఉద్దేశపూర్వకంగా వివాదాస్పద చిత్రాలతో ఆడుకునే అవకాశం ఉందని, వ్య‌తిరేకించేవారుంటే అజ్ఞానాన్ని ప్రదర్శించడానికి సిద్ధంగా ఉండవచ్చని కూడా ఒక నెటిజ‌న్ వ్యాఖ్యానించాడు. అతిని ఆరాధించే ఒక వర్గం సందీప్ వంగాను 'స్వస్తిక్ దెయ్యం' అని ప్రేమ‌గా పిలిచారు. హిందువుల చిహ్నమైన స్వస్తికను ద్వేషపూరిత చిహ్నంగా చిత్రీకరిస్తున్నారని ఆరోపిస్తూ యానిమ‌ల్ పై నిషేధం విధించాలని కోరుతూ భారత ప్రభుత్వాన్ని ఇందులోకి లాగారు. మూవీ విడుద‌ల‌ను ఆపేయాల‌ని పిటిషన్ దాఖలు చేయాలని ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులను వారు కోరుతున్నారు. వివాదాల‌తో ప్ర‌చారం ఇటీవ‌ల ట్రెండ్. ఇప్పుడు యానిమ‌ల్ కి ఈ వివాదాలు మ‌రో లెవ‌ల్లో వ‌ర్క‌వుట్ అవుతాయ‌ని అంతా భావిస్తున్నారు. ఇంత‌కుముందు క‌బీర్ సింగ్ (అర్జున్ రెడ్డి హిందీ రీమేక్) రిలీజ్ స‌మ‌యంలోను ఇలాంటి వివాదాలు అగ్గి రాజేసాయి. కానీ వివాదాల‌తో ప్ర‌చారం బాగా క‌లిసొచ్చి ఆ సినిమా షాహిద్ క‌పూర్ కెరీర్ లో ది బెస్ట్ హిట్ గా నిలిచింది. ఇప్పుడు ర‌ణ‌బీర్ కి కూడా అలా క‌లిసొస్తుంద‌నే అంచ‌నా వేస్తున్నారు.