Begin typing your search above and press return to search.

బుర్జ్ ఖలీఫాపై 'యానిమ‌ల్' గర్జ‌న

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది

By:  Tupaki Desk   |   18 Nov 2023 5:30 AM GMT
బుర్జ్ ఖలీఫాపై యానిమ‌ల్ గర్జ‌న
X

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ నటించిన 'యానిమల్' ఈ ఏడాది మోస్ట్ అవైటెడ్ చిత్రంగా విడుద‌ల‌కు సిద్ధ‌మ‌వుతోంది. ఈ సినిమా టీజ‌ర్, పోస్ట‌ర్లు ఇప్ప‌టికే అభిమానుల్లో క్యూరియాసిటీని పెంచాయి. ప్ర‌చారంలో భాగంగా టీమ్ విస్త్ర‌తంగా జ‌నాల్ని ఆక‌ర్షించే వేదిక‌ల‌ను ఎంచుకుంటోంది. ఇటీవల దుబాయ్ స్కైలైన్‌కి మించిన ఐకానిక్ బుర్జ్ ఖలీఫాపై ప్ర‌ద‌ర్శ‌న‌కు అనుమ‌తి ల‌భించింది. లార్జ‌ర్ దేన్ లైఫ్ త‌ర‌హాలో ప్రపంచంలోని అత్యంత ఎత్తైన భవనంపై 'యానిమ‌ల్' ప్రత్యేక కట్ ని ప్రొజెక్ట్ చేసారు. భారీ భ‌వంతి సినిమాటిక్ మ్యాజిక్ కోసం మెగా కాన్వాస్‌గా మార్చింది.


రణ్‌బీర్ కపూర్, బాబీ డియోల్‌తో పాటు నిర్మాత భూషణ్ కుమార్ దుబాయ్‌లో ప్ర‌చార వేదికపైకి వచ్చారు. ఈ అద్భుతాన్ని చూడటానికి గుమిగూడిన అభిమానుల సముద్రంలా మారారు. సహ నిర్మాతలు శివ చనన - ప్రణయ్ రెడ్డి వంగా కూడా గ్రాండ్ ఈవెంట్ లో పాల్గొన్నారు. ఇటీవల ఈ చిత్రం మాన్‌హాటన్ ఐకానిక్ టైమ్స్ స్క్వేర్‌లో ప్ర‌ద‌ర్శిత‌మై వేవ్స్ క్రియేట్ చేసింది. సాంస్కృతిక కేంద్రం డిజిటల్ బిల్‌బోర్డ్‌లపై అద్భుతమైన ప్రదర్శనతో టీజర్ వీక్ష‌కుల దృష్టిని ఆకర్షించింది. ఇప్పుడు బుర్జ్ ఖ‌లీఫాపై ప్ర‌త్యేక క‌ట్ వీక్ష‌ణ‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా అందరి దృష్టిని యానిమ‌ల్ ఆక‌ర్షించింది. సినిమా విడుదలకు కౌంట్‌డౌన్ ఇప్ప‌టికే మొద‌లైందన్న సంకేతం అందింది. ప్ర‌చారం ఎన్న‌డూ లేనంతగా ఎలక్ట్రిఫైయింగ్ గా మారింది.

యానిమల్‌లో రణబీర్ కపూర్, బాబీ డియోల్, రష్మిక మందన్న, అనిల్ కపూర్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. భూషణ్ కుమార్- క్రిషన్ కుమార్ ల‌కు చెందిన‌ టి-సిరీస్, మురాద్ ఖేతాని కి చెందిన‌ సినీ1 స్టూడియోస్ .. ప్రణయ్ రెడ్డి వంగాకు చెందిన‌ భద్రకాళి పిక్చర్స్ ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. సందీప్ రెడ్డి వంగా దర్శకత్వం వహించిన ఈ చిత్రం క్రైమ్ డ్రామా జానర్ క‌థాంశంతో తెర‌కెక్కింది. 1 డిసెంబర్ 2023న ప్రేక్షకుల ముందుకు రానుంది.