Begin typing your search above and press return to search.

500+ మిలియన్స్‌.. యానిమల్ రికార్డ్స్‌ కంటిన్యూ

తాజాగా యానిమల్ సినిమా యొక్క మ్యూజిక్‌ ఆల్బం కూడా అరుదైన రికార్డ్ ను నమోదు చేసింది.

By:  Tupaki Desk   |   12 Feb 2024 7:45 AM GMT
500+ మిలియన్స్‌.. యానిమల్ రికార్డ్స్‌ కంటిన్యూ
X

రణబీర్ కపూర్ హీరోగా రష్మిక మందన్న హీరోయిన్ గా తెలుగు దర్శకుడు సందీప్ వంగ దర్శకత్వంలో వచ్చిన యానిమల్‌ సినిమా వసూళ్లతో రికార్డుల వర్షం కురిపించిన విషయం తెల్సిందే. నార్త్‌ మరియు సౌత్ తో పాటు ఓవర్సీస్ లో కూడా యానిమల్ సినిమా కుమ్మేసింది అనేందుకు నమోదు అయిన కలెక్షన్స్ సాక్ష్యం.

సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో వచ్చిన ఈ వైల్డ్‌ యానిమల్‌ సినిమాకు థియేట్రికల్‌ రిలీజ్ లోనే కాకుండా ఓటీటీ స్ట్రీమింగ్ లో కూడా రికార్డులు నమోదు అయ్యాయి. తాజాగా యానిమల్ సినిమా యొక్క మ్యూజిక్‌ ఆల్బం కూడా అరుదైన రికార్డ్ ను నమోదు చేసింది.

స్పోటిఫై లో యానిమల్‌ సినిమా ఆల్బమ్‌ ఏకంగా 500 మిలియన్ కి పైగా స్ట్రీమ్‌ అవ్వడం జరిగిందట. తక్కువ సమయంలో అంత ఎక్కువ స్ట్రీమింగ్‌ అవ్వడం రికార్డ్‌ గా మ్యూజిక్‌ స్ట్రీమింగ్‌ సంస్థ ప్రకటించింది. జమాల్‌ కుత్తు సాంగ్‌ తో పాటు సినిమాలోని అన్ని పాటలకు కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది.

సినిమా హిట్ అయ్యి భారీ వసూళ్లు రావడం ఒక ఎత్తు అయితే, ప్రముఖ ఓటీటీ లో స్ట్రీమింగ్‌ అయ్యి రికార్డ్ స్థాయి స్ట్రీమింగ్‌ అవర్స్ నమోదు అవ్వడం మరో ఎత్తు. ఇప్పుడు ప్రముఖ మ్యూజిక్‌ స్ట్రీమింగ్ యాప్‌ లో కూడా యానిమల్‌ రికార్డ్‌ ను నమోదు చేయడం జరిగింది. ఇంకా ముందు ముందు యానిమల్‌ ఎన్ని రికార్డులను నమోదు చేస్తుందో చూడాలి.