Begin typing your search above and press return to search.

యానిమాల్ అనిల్.. డేంజరస్ లుక్

ఆయన లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లూ కలర్ సూటు బూటు వేసుకొని ఓ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆయన ఒంటిపై గాయాలకు కట్లు కట్టి స్పష్టంగా కనపడుతున్నాయి.

By:  Tupaki Desk   |   21 Sep 2023 3:33 PM GMT
యానిమాల్ అనిల్.. డేంజరస్ లుక్
X

బాలీవుడ్ స్టార్ హీరో రణబీర్ కపూర్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం యానిమల్. టాలీవుడ్ దర్శకుడు సందీప్ వంగ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. అర్జున్ రెడ్డితో ఓవర్ నైట్ స్టార్ డైరెక్టర్ గా మారిన సందీప్ వంగ, ఇదే సినిమాని షాహిద్ కపూర్ తో బాలీవుడ్ లో కబీర్ సింగ్ గా పరిచయం చేశారు. అక్కడ కూడా ఈ సినిమా బాక్సాఫీసును షేక్ చేసింది.


ఈ మూవీ తర్వాత ఆయన రణబీర్ తో యానిమల్ చేసే అవకాశం వచ్చింది. ఇప్పటికే మూవీ ప్రీ టీజర్ తో అంచనాలు పెంచేశారు. నిజానికి, ఈపాటికి సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉంది. కానీ, కొన్ని కారణాల వల్ల వాయిదా పడుతూ వచ్చింది. కాగా, తాజాగా ఈ మూవీ నుంచి అనిల్ కుమార్ లుక్ ని రివీల్ చేశారు. ఆయన బల్బీర్ సింగ్ అనే పాత్రను పోషిస్తున్నారు.

ఆయన లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది. బ్లూ కలర్ సూటు బూటు వేసుకొని ఓ కుర్చీలో కూర్చొని ఉన్నారు. ఆయన ఒంటిపై గాయాలకు కట్లు కట్టి స్పష్టంగా కనపడుతున్నాయి. ఆయన డాన్ రోల్ పోషిస్తున్నారని ఆ ఫోటో చూస్తుంటే అర్థమౌతుంది. ఈ విషయంలో క్లారిటీ రావాలంటే, సినిమా ప్రేక్షకుల ముందుకు రావాల్సిందే. అనిల్ కుమార్ పోస్టర్ తో పాటు, ఈ మూవీ టీజర్ రిలీజ్ డేట్ ని కూడా ప్రకటించారు. ఈ నెల 28వ తేదీన ఈ మూవీ టీజర్ విడుదల చేయనున్నారు. ఇక, ఈ మూవీ డిసెంబర్ 1వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది.

ఈ సినిమాలో రణబీర్ సరసన నేషనల్ క్రష్ రష్మిక హీరోయిన్ గా నటిస్తోంది. బాలీవుడ్ లో సక్సెస్ కావాలని రష్మిక ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఆ ఆశలన్నీ, ఈ మూవీతో నిజమౌతాయని అనుకుంటోంది. ఇక, ఈ సినిమాలో అనిల్ కపూర్ తో పాటు బాబీ డియోల్ కూడా కీలక పాత్ర పోషిస్తున్నారు.

టీ సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ 1 స్టూడియోస్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఇక ఈ యానిమల్ సినిమా చాలా హింసాత్మకంగా సాగుతుందనే ప్రచారం జరుగుతోంది. గ్యాంగ్‌స్టర్ కథాంశంతో యానిమల్ సినిమా మోస్ట్ వైలెంట్ గా రానుంది.