Begin typing your search above and press return to search.

బాలీవుడ్ నటుడితో అనిల్ సుంకర.. క్రేజీ ప్రాజెక్ట్?

నిర్మాత అనిల్ సుంకర.. గతేడాది ఈ పేరు టాలీవుడ్ లో కాస్త ఎక్కువగానే వినిపించింది. కానీ ఆయనకు 2023 ఏ మాత్రం కూడా కలసి రాలేదు.

By:  Tupaki Desk   |   22 Feb 2024 9:26 AM GMT
బాలీవుడ్ నటుడితో అనిల్ సుంకర.. క్రేజీ ప్రాజెక్ట్?
X

నిర్మాత అనిల్ సుంకర.. గతేడాది ఈ పేరు టాలీవుడ్ లో కాస్త ఎక్కువగానే వినిపించింది. కానీ ఆయనకు 2023 ఏ మాత్రం కూడా కలసి రాలేదు. ఆయన ప్రొడ్యూస్ చేసిన అక్కినేని అఖిల్ ఏజెంట్, మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలు డిజాస్టర్లుగా మారాయి. ఇక ఏజెంట్ చిత్రం అయితే అనిల్ సుంకరకు ఊహించని దెబ్బ కొట్టింది. రూ.100 కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ చిత్రం కనీస వసూళ్లు కూడా రాబట్టలేదు.

వరుస డిజాస్టర్లు వచ్చినా మంచి చిత్రాలు చేసేందుకు ప్రయత్నిస్తూనే ఉన్నారు అనిల్ సుంకర. అయితే ఏజెంట్, భోళా శంకర్ సినిమాల మధ్య శ్రీవిష్ణుతో సామజవరగమన తీశారు. ఈ సినిమా మంచి విజయాన్ని అందుకున్నా లాస్ రికవర్ అవ్వలేదు. ఇటీవల ఊరు పేరు భైరవకోన మూవీతో ఆడియన్స్ ముందుకు వచ్చారు. యంగ్ హీరో సందీప్ కిషన్ నటించిన ఈ మూవీ డీసెంట్ టాక్ దక్కించుకుంది.

తాజాగా నిర్మాత అనిల్ సుంకర క్రేజీ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. బాలీవుడ్ యాక్షన్ నటుడు జాన్ అబ్రహంతో దిగిన ఫొటోను పోస్ట్ చేశారు. "ఇష్టమైన వారితో టైమ్ స్పెండ్ చేయడం.. ఎప్పుడూ సరదాగా అనిపిస్తుంటుంది. స్నేహితుడు, నటుడు జాన్ అబ్రహం కలిసి పనిచేయాలని ఎదురుచూస్తున్నా" అంటూ క్యాప్షన్ ఇచ్చారు. అయితే వీరిద్దరి భేటీపై ఇప్పుడు నెట్టింట తెగ మాట్లాడుకుంటున్నారు.

వీరిద్దరు కేవలం ఫ్రెండ్స్ గా కలిశారా? లేక సినిమా కోసం చర్చించుకోవడానికి మీట్ అయ్యారా అని అనుమానపడుతున్నారు. అనిల్ సుంకర కొత్త తెలుగు చిత్రంలో జాన్ అబ్రహం నటించనున్నారని కొందరు చెబుతున్నారు. మరికొందరు పాన్ ఇండియా రేంజ్ లో అనిల్ సుంకర సినిమా తీయనున్నారని, అందులో జాన్ అబ్రహం నటించనున్నారని కామెంట్లు పెడుతున్నారు. మరి వీటిలో నిజమెంతో తెలియాలంటే వేచి చూడాల్సిందే.

మరోవైపు, ఊరు పేరు భైరవకోన సినిమాకు దర్శకత్వం వహించిన వీఐ ఆనంద్ తో మరో ప్రాజెక్ట్ ను నిర్మించనున్నారు అనిల్ సుంకర. ఇటీవల ఈ మూవీకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. డైరెక్టర్ ఆనంద్‌ బర్త్ డే సందర్బంగా విషెస్ చెబుతూ కొత్త సినిమాను అనౌన్స్‌ చేశారు. ఆ సినిమా కథ యూనిక్‌ గా ఉండబోతోందని తెలిపారు. మరి ఆ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.