Begin typing your search above and press return to search.

డైరెక్టర్ తో మిల్కీ బ్యూటీ గొడవ.. అసలేం జరిగింది..?

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపుడి మిల్కీ బ్యూటీ తమన్నా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని ఆమధ్య కొన్ని వార్తలు వచ్చాయి

By:  Tupaki Desk   |   28 Nov 2023 3:00 AM GMT
డైరెక్టర్ తో మిల్కీ బ్యూటీ గొడవ.. అసలేం జరిగింది..?
X

స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపుడి మిల్కీ బ్యూటీ తమన్నా ఇద్దరి మధ్య చిన్న గొడవ జరిగిందని ఆమధ్య కొన్ని వార్తలు వచ్చాయి. అనిల్ డైరెక్షన్ లో తమన్నా f2, f3 సినిమాల్లో నటించింది. f2 సినిమా షూటింగ్ టైం లోనే తమన్నాతో డైరెక్టర్ గొడవ గురించి వార్తలు వచ్చాయి. అయితే దీనిపై ఈమధ్య ఇంటర్వ్యూలో క్లారిటీ ఇచ్చారు అనిల్ రావిపుడి. ఎఫ్ 2 సినిమా సెట్స్ లో తమన్నా తన టైం అయిపోయింది వెళ్తానని అనగా రేపు మార్నింగ్ అందరితో కలిసి సీన్ ఉందని రావాలని చెప్పారట.

కానీ తనకు మార్నింగ్ జిం ఉంటుందని తమన్నా చెప్పిందట. సినిమాలో మేజర్ కాస్టింగ్ తో ఉన్న సీన్ కాబట్టి తప్పనిసరిగా రావాలని అనిల్ రావిపుడి అన్నారట. ఆ టైం లో డైరెక్టర్ హీరోయిన్ మధ్య చిన్న డిస్టబన్స్ ఏర్పడిందట. అయితే ఈ ఇష్యూ కొనసాగకుండా వెంటనే సాల్వ్ చేసుకున్నారట అనిల్ రావిపుడి. ఆ షెడ్యూల్ లోనే ఆ గొడవకు ఫుల్ స్టాప్ పెట్టేశామని అన్నారు అనిల్

డైరెక్టర్ గా సినిమా త్వరగా పూర్తి చేయాలన్న ఆలోచన ఉంటుంది. ఈ క్రమంలో డేట్స్ విషయంలో హీరో, హీరోయిన్స్ లతో డైరెక్టర్స్ కి కొంత అసంతృప్తి ఉంటుంది. అయితే సెట్ లో గొడవ అనగానే అదేదో పెద్దదని బయట ప్రొజెక్ట్ చేస్తారు. కానీ అక్కడ ఏమి జరగదు. అనిల్ రావిపుడి కూడా తమన్నాతో తనకు జరిగింది అసలు గొడవే కాదని అన్నారు.

అనిల్ రావిపుడి డైరెక్షన్ లో చేయడం వల్ల తమన్నాకి f2, f3 రెండు బ్యాక్ టు బ్యాక్ హిట్లు పడ్డాయి. హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి 18 ఏళ్లు అవుతున్నా తమన్నా ఇప్పటికీ అదే ఫాం కొనసాగిస్తుంది. ఈమధ్య వెబ్ సీరీస్ లో కూడా నటిస్తున్న తమన్నా అక్కడ మాత్రం గ్లామర్ షోతో రెచ్చిపోతుంది. కచ్చితంగా అమ్మడికి ఈ వెబ్ సీరీస్ లు మంచి మైలేజ్ ఇస్తున్నాయని చెప్పొచ్చు. టాలీవుడ్ లో ఏ చిన్న అవకాశాన్ని కూడా వదిలిపెట్టకుండా చేస్తున్న తమన్నా మరో ఐదేళ్లు ఇదే ఫాం కొనసాగించే ఛాన్స్ ఉందని చెప్పొచ్చు. బాలీవుడ్ లో కూడా అడపాదడపా అవకాశాలు అందుకుంటున్న తమన్నా అక్కడ మాత్రం రెచ్చిపోవడంలో వెనక్కి తగ్గట్లేదు. అయితే సౌత్ లో తనకున్న ఇమేజ్ కి తగినట్టుగా కథలను ఎంపిక చేసుకుంటుంది తమన్నా.