Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి మరో క్రేజీ కాంబో!

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది.

By:  Tupaki Desk   |   25 Nov 2023 8:57 AM GMT
అనిల్ రావిపూడి మరో క్రేజీ కాంబో!
X

టాలీవుడ్ లో మరో క్రేజీ కాంబినేషన్ సెట్ అయినట్లు తెలుస్తోంది. సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి త్వరలోనే మెగాస్టార్ చిరంజీవితో సినిమా చేయబోతున్నట్లు ఫిలిం సర్కిల్స్ లో టాక్ వినిపిస్తోంది. మరో ఆసక్తికర విషయం ఏంటంటే, ఈ ప్రాజెక్ట్ ని అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించబోతుండడం విశేషం. దిల్ రాజ్ ఎప్పటినుంచో తన అభిమాన హీరో చిరంజీవితో సినిమా చేయాలని ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాడు.

అది అనిల్ రావిపూడి ద్వారా తీరబోతోంది. మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్ తో తన 50వ సినిమాను నిర్మిస్తున్న దిల్ రాజుకి మెగాస్టార్ తో ప్రాజెక్ట్ సెట్ అయినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి కథ చర్చలు జరుగుతున్నాయట. మెగాస్టార్ కి లైన్ నచ్చడంతో ఫైనల్ వెర్షన్ విన్నాక ప్రాజెక్ట్ ని ఎప్పుడు స్టార్ట్ చేయాలనేది డిసైడ్ చేస్తారట. ప్రాజెక్ట్ లాక్ అయ్యాకే అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు తెచ్చుకున్నాడు అనిల్ రావిపూడి. కమర్షియల్ కథలకి కామెడీ డోస్ మరింత పెంచి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ డైరెక్టర్ రీసెంట్ గా 'భగవంత్ కేసరి' తో మరో సక్సెస్ ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఇప్పుడు చిరుతో మూవీ అనె న్యూస్ బయటికి రాగానే వీళ్ళిద్దరి కాంబినేషన్ లో చంటబ్బాయ్ లాంటి ఎంటర్టైన్మెంట్ మూవీని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

ఆ మధ్య ఓ ఇంటర్వ్యూలో కూడా అనిల్ రావిపూడి చిరంజీవితో సినిమా చేసే ఛాన్స్ వస్తే ఆయన్ని ఒక రేంజ్ లో చూపిస్తానని చెప్పిన సంగతి తెలిసిందే. మరి ఇప్పుడు మెగాస్టార్ ని డైరెక్ట్ చేసే ఛాన్స్ రావడంతో ఆయనతో ఎలాంటి సబ్జెక్ట్ తో సినిమా తీస్తాడనేది సర్వత్రా ఆసక్తికరంగా మారింది. ఇక ఇప్పటివరకు మెగా ఫ్యామిలీలో పవన్ కళ్యాణ్ తో సినిమా తీయాలన్న కోరికను వకీల్ సాబ్ ద్వారా తీర్చుకున్న దిల్ రాజు ఇప్పుడు చిరంజీవితో తన డ్రీమ్ ని ఫుల్ ఫిల్ చేసుకోబోతున్నాడు.

ఇండస్ట్రీలో ఉన్న అగ్ర హీరోలు అందరితో తన బ్యానర్లో సినిమాలు చేయాలన్నదే దిల్ రాజు కోరిక. అందుకే ఓవైపు యంగ్, స్టార్ హీరోలతో పాటు సీనియర్ హీరోలతో సినిమాలు నిర్మిస్తున్నాడు. కేవలం టాలీవుడ్ లోనే కాదు ఆల్రెడీ ఇప్పటికే కోలీవుడ్లో తలపతి విజయ్ తో 'వారిసు' మూవీని నిర్మించి అక్కడ కూడా బోణి కొట్టాడు. రీసెంట్ గా రజినీకాంత్ తో ప్రాజెక్టు కొంచెంలో మిస్ అయింది. మళ్ళీ ఆయనతో సినిమా కోసం ట్రై చేస్తున్నాడు