Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి పొలిటికల్ ప్లాన్.. ఏంటి మ్యాటర్?

టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న స్టార్ మేకర్ అనిల్ రావిపూడి.

By:  Tupaki Desk   |   17 Nov 2023 5:23 AM GMT
అనిల్ రావిపూడి పొలిటికల్ ప్లాన్.. ఏంటి మ్యాటర్?
X

టాలీవుడ్ లో కమర్షియల్ డైరెక్టర్ గా వరుస సక్సెస్ లతో దూసుకుపోతున్న స్టార్ మేకర్ అనిల్ రావిపూడి. పటాస్ నుంచి భగవంత్ కేసరి వరకు డబుల్ హ్యాట్రిక్ తో రాజమౌళి తర్వాత వరుస హిట్స్ అందుకున్న డైరెక్టర్ గా అనిల్ రావిపూడి పేరు వినిపిస్తోంది అతని స్టైల్ ఆఫ్ మేకింగ్, ఆటిట్యూడ్ కి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అలాగే అనిల్ రావిపూడిలో మంచి యాక్టర్ కూడా ఉన్నాడు. అప్పుడప్పుడు కామెడీ షోలు, ఇంటర్వ్యూలలో తన కామెడీ టైమింగ్ తో ఎంటర్టైన్ చేస్తూ ఉంటాడు.

ప్రస్తుతం ఆహాలో ఓ కామెడీ షోకి జడ్జ్ గా వ్యవహరిస్తున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా అనిల్ రావిపూడి ఇన్ స్టాగ్రామ్ హ్యాండిల్ నుంచి ఒక వీడియో షేర్ చేసాడు. అందులో పొలిటికల్ లీడర్ గెటప్ లో కుర్చీలో కూర్చున్న అనిల్ రావిపూడి ఇప్పటి వరకు సినిమాలు చేసి మిమ్మల్ని ఎంటర్టైన్ చేశాను. మీరు ఎంటర్టైన్ అయ్యారు. గెలిచేది నేనైనా గెలిపించేది మీరు. కాని ఈ సారి నా గెలుపు థియేటర్ లో కాదు ఒక అసెంబ్లీ, ఒక పార్లమెంట్ లో ప్లాన్ చేసుకుంటున్నాను.

మీరు పంపిస్తారుగా అంటూ అడిగాడు. అలాగే ఒక పార్టీ పెట్టబోతున్న మన పార్టీ పేరేంటో, మన ఎమ్మెల్యే క్యాండిడేట్స్ ఎవరో మొత్తం ఇన్ఫర్మేషన్ తో త్వరలో వస్తా అంటూ వీడియోలో చెప్పుకొచ్చాడు. అయితే ఈ వీడియో ప్రోమో చూస్తుంటే ఆహాలో చేయబోయే పొలిటికల్ టచ్ ఎంటర్టైమెంట్ షోకి సంబందించినదిగా అనిపిస్తోంది. అయితే అనిల్ రావిపూడి తన స్టైల్ లో ఈ షోకి సంబంధించి లీడ్ ఇచ్చాడని నెటిజన్లు భావిస్తున్నారు.

అనిల్ రావిపూడి హీరోగా పొలిటికల్ సెటైరికల్ మూవీ ఒకటి రాబోతోందని, ఆహా ఒటీటీ దీనిని నిర్మిస్తోందని, దానికోసమే ఈ ప్రమోషన్ సెటప్ అని అంచనా వేస్తున్నారు. మరి ఈ రెండింటిలో ఏంటి అనేది త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఒక వేళ అనిల్ రావిపూడి హీరోగా పొలిటికల్ సెటైరికల్ మూవీ వస్తే మాత్రం ఆడియన్స్ కి కావాల్సినంత ఎంటర్టైన్మెంట్ దొరుకుతుంది.

ఒకవేళ షోచేసిన కూడా కొత్తగా ఉండే అవకాశం ఉంది. మరి వీటిలో ఏది ప్లాన్ చేస్తున్నారు అనేది మాత్రం ఇప్పుడు కన్ఫ్యూజన్ గానే ఉంది. అనిల్ రావిపూడిని యాక్టర్ గా సిల్వర్ స్క్రీన్ పై చూడాలని చాలా మంది ఎక్స్ పెక్ట్ చేస్తున్నారు. ఆ కోరిక ఏమైనా నేరవేరుస్తారేమో చూడాలి.