Begin typing your search above and press return to search.

అనిల్ రావిపూడి.. ఈసారి మెగా హీరో..

ఇప్పటికే ఈ సినిమా కథని దర్శకుడు చిరంజీవికి నేరేట్ చేయడం, ఆయన ఒకే చెప్పి లాక్ చేయడం జరిగిపోయినట్లు తెలుస్తోంది

By:  Tupaki Desk   |   9 Aug 2023 4:57 AM GMT
అనిల్ రావిపూడి.. ఈసారి మెగా హీరో..
X

టాలీవుడ్ లో రాజమౌళి తర్వాత మోస్ట్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ గా వరుసగా ఐదు హిట్స్ తో దూసుకుపోతున్న యంగ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి. పక్కా కమర్షియల్ స్టోరీలకి తనదైన కామెడీ ఎంటర్టైన్మెంట్ జోడించి కథలు చెప్పడంతో అనిల్ బాగా సక్సెస్ అయ్యారు. అందుకే హిట్స్ మీద హిట్స్ కొడుతూ మంచి జోష్ మీద ఉన్నారు. ప్రస్తుతం బాలకృష్ణ హీరోగా భగవంత్ కేసరి మూవీ చేస్తున్నారు. ఈ సినిమా దసరాకి రిలీజ్ కాబోతోంది.

సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటిస్తుండగా, శ్రీలీల బాలయ్య కూతురి పాత్రలో కనిపించబోతోంది. తెలంగాణ బ్యాక్ డ్రాప్ లో బాలయ్య స్టైల్ యాక్షన్, తన స్టైల్ ఎంటర్టైన్మెంట్ కలిపి భగవంత్ కేసరి సినిమాని అనిల్ రావిపూడి సిల్వర్ స్క్రీన్ పై ఆవిష్కరిస్తున్నారు. దీని తర్వాత అనిల్ రావిపూడి చేయబోయే ప్రాజెక్ట్ గురించి అప్పుడే ఒక టాక్ వచ్చేసింది. మెగాస్టార్ చిరంజీవితో అనిల్ నెక్స్ట్ సినిమా చేయబోతున్నారంట.

ఇప్పటికే ఈ సినిమా కథని దర్శకుడు చిరంజీవికి నేరేట్ చేయడం, ఆయన ఒకే చెప్పి లాక్ చేయడం జరిగిపోయినట్లు తెలుస్తోంది. ఓ పెద్ద ప్రొడక్షన్ హౌస్ ఈ చిత్రాన్ని నిర్మించబోతోందంట. అయితే ఈ మూవీ ఈ ఏడాదిలో స్టార్ట్ అయ్యే అవకాశం లేదు. మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం కళ్యాణ్ కృష్ణ కురసాల దర్శకత్వంలో మూవీని సెట్స్ పైకి తీసుకొని వెళ్ళబోతున్నారు. ప్రసన్న కుమార్ బెజవాడ ఈ మూవీకి కథ సిద్ధం చేశారు.

దీని తర్వాత వశిష్ఠ మల్లిడితో సోషియో ఫాంటసీ మూవీని ఈ ఏడాది ఆఖరిలో స్టార్ట్ చేస్తారని తెలుస్తోంది,. ఈ చిత్రం తర్వాత అనిల్ రావిపూడితో సినిమాని సెట్స్ పైకి తీసుకొని వెళ్లే ఛాన్స్ ఉంటుంది. అయితే మెగాస్టార్ తో చేయబోయే సినిమా కోసం అనిల్ రావిపూడి వచ్చే ఏడాది వరకు వెయిట్ చేస్తారా లేక ఇంకో సినిమా ఈ లోపు కంప్లీట్ చేస్తారా అనేది తెలియాల్సి ఉంది.

మెగాస్టార్ ఎనర్జీ, యాక్టింగ్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అనిల్ రావిపూడి పక్కా కమర్షియల్ స్టోరీ లైన్స్ తీసుకొని దానికి అవుట్ అండ్ అవుట్ కామెడీ యాక్షన్ మిళితం చేసి కథలు చెప్పే విధంగా అందరికి బాగా కనెక్ట్ అయ్యింది.

అలాగే అతను ఎంచుకునే స్టోరీ లైన్స్ కూడా ఒకదానికి ఒకటి సంబంధం లేకుండా ఉంటాయి. అదే సక్సెస్ ఫార్ములాతో వెళ్తున్నారు. అలాంటి స్టోరీతో ఇప్పుడు మెగాస్టార్ మూవీ పడితే కచ్చితంగా ఫ్యాన్స్ కి విందుభోజనం అని చెప్పొచ్చు. రెగ్యులర్ ఆడియన్స్ కూడా ఇలాంటి కథలని ఇష్టపడుతూ ఉంటారు. మరి వీరి కాంబో అఫీషియల్ గా ఎప్పుడు కన్ఫర్మ్ అవుతుందనేది చూడాలి.